ఈసారి తారక్ బర్త్ డే.. సో స్పెషల్

Jr NTR Birthday : ఇన్నేళ్ల ఎన్టీఆర్ కెరీర్ లో ఓ దశలో కేవలం ప్లాప్స్ ను మాత్రమే చూసాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని టెంపర్ నుంచి దేవర వరకు వరుస హిట్స్ అందుకున్నాడు. ప్రతి తారక్ అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేసాడు. ఇక ఈసారి తారక్ బర్త్ డే చాలా స్పెషల్ అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే...

Jr NTR Birthday : ఇన్నేళ్ల ఎన్టీఆర్ కెరీర్ లో ఓ దశలో కేవలం ప్లాప్స్ ను మాత్రమే చూసాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని టెంపర్ నుంచి దేవర వరకు వరుస హిట్స్ అందుకున్నాడు. ప్రతి తారక్ అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేసాడు. ఇక ఈసారి తారక్ బర్త్ డే చాలా స్పెషల్ అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే...

ఎన్టీఆర్ అవ్వడం అంతా ఈజీనా అంటే అసలు కానే కాదు. తల మీద కొన్ని టన్నుల బరువు పెట్టుకుని ఎవరైనా పరిగెత్తిగలరా! కానీ తారక్ పరిగెత్తాడు. పైగా అది మామూలు పరుగు కూడా కాదు అది ఓ రేస్ అని చెప్పి తీరాల్సిందే. తారక్ ఇండస్ట్రీ జర్నీనే అలా మొదలైంది. తల మీద NTR అనే ఓ కిరీటాన్ని పెట్టుకుని బయల్దేరాడు. చూడడానికి కిరీటమే అయినా దాని బ‌రువు ట‌న్నుల కొద్ది ఉంటుంది. మరి ఆయన సంపాదించుకున్న అభిమానం అలాంటిది.

తాత పేరు , తాత రూపు ఉంటె సరిపోతుందా? ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవడం అంత సులువు కాదు. అసలు ఇతనికి ఏమి అర్హతలు ఉన్నాయి హీరో అవ్వడానికి? అని ఇలా ఎన్నో ప్రశ్నలతో తారక్ జర్నీ మొదలైంది. పైగా ఎన్టీఆర్ మనవడు అవ్వడం వలన ప్రతి కన్ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ పేరుకు ఎలాంటి మచ్చ తీసుకురాకూడదు అనే భయం ఓ వైపు.. ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవాలని మరోవైపు. ఇలాంటివాటి అన్నిటిని ఎదుర్కొని ఎన్నో ప్లాప్స్ హిట్స్ చూస్తూ.. RRR తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ టాలీవుడ్ హీరో బాలీవుడ్ ను ఏలడానికి రెడీ అయ్యాడు.

పైగా ఈసారి తారక్ బర్త్ డే చాలా స్పెషల్ అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే సరిగ్గా తన కెరీర్ మొదలుపెట్టిన 25 సంవత్సరాలకు తారక్ బాలీవుడ్ ఎంట్రీ సాకారమైంది. గతంలో RRR లాంటి డబ్బింగ్ మూవీస్ రూపంలో హిట్స్ సాధించాడు. అయితే ఓ స్ట్రెయిట్ మూవీ తో ఎన్టీఆర్ అంటే ఏంటో బాలీవుడ్ థియేటర్స్ దద్దరిల్లేలా నిరూపించాలని అభిమానుల కోరిక. మరి కొద్దిరోజుల్లో అది నెరవేరబోతోంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఓ దశలో కేవలం ప్లాప్స్ ను మాత్రమే చూసాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని టెంపర్ నుంచి దేవర వరకు వరుస హిట్స్ అందుకున్నాడు. ప్రతి తారక్ అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేసాడు. ఇలాంటి సక్సెస్ ట్రాక్ రికార్డ్ మరే హీరోకు లేదని చెప్పి తీరాల్సిందే.

ఇక ఇప్పుడు వార్ మూవీ విధ్వంసం సృష్టించడానికి రెడీ అయింది. దీనిని బట్టి తారక్ నెక్స్ట్ మూవీస్ ప్లానింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఓ టాలీవుడ్ టాప్ హీరో అక్కడ ఓ స్ట్రెయిట్ హిందీ మూవీ చేసినప్పటికీ.. వార్ 2 లెక్క వేరే అని చెప్పాలి. ఒక్కసారి మూవీ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ మాస్ యాక్షన్ అక్కడ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తే మాత్రం.. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ కంప్లీట్ గా మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వార్ 2 తర్వాత తారక్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments