సీక్వెల్స్ తో వందల కోట్లు నష్టపోయిన ప్రొడక్షన్ హౌస్! ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

This Production House Got 4 Sequels Flop: సాధారణంగా సీక్వెల్ తో హిట్టు కొట్టినా.. ఫ్లాప్ ఇచ్చినా డైరెక్టర్ గురించే మాట్లాడతారు.. కానీ, ప్రొడక్షన్ హౌస్ గురించి చర్చ జరగదు. కానీ, ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 4 సీక్వెల్స్ తో నష్టాలు చవిచూసింది.

This Production House Got 4 Sequels Flop: సాధారణంగా సీక్వెల్ తో హిట్టు కొట్టినా.. ఫ్లాప్ ఇచ్చినా డైరెక్టర్ గురించే మాట్లాడతారు.. కానీ, ప్రొడక్షన్ హౌస్ గురించి చర్చ జరగదు. కానీ, ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 4 సీక్వెల్స్ తో నష్టాలు చవిచూసింది.

ఇండియన్ సినిమాలో హిట్టు కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఎంతో కష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, లెక్కకు మించిన హిట్స్ కొట్టిన.. కొడుతున్న డైరెక్టర్స్ ని చూస్తూనే ఉన్నాం. అయితే సీక్వెల్ తో హిట్టు కొట్టడం మాత్రం అంత తేలిక కాదు. అందులోనూ పాన్ ఇండియా లెవల్లో ఒక సినిమాకి సీక్వెల్ తీసి అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించడం అంటే కత్తి మీద సాములాంటిదే. అందుకే చాలా మంది డైరెక్టర్స్ ఆ పనిని తలెకెత్తుకోరు. ఇప్పుడంటే చాలా సినిమాలు సీక్వెల్ తో కూడా హిట్ట్స్ అందుకుంటున్నాయి. అయితే చాలా మంది సీక్వెల్ హిట్ అయినా.. ఫ్లాప్ అయినా డైరెక్టర్ గురించే మాట్లాడతారు. కానీ, ప్రొడక్షన్ హౌస్ ప్రస్తావన రాదు. ఇప్పుడు ఒక బ్యానర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నాలుగు సీక్వెల్స్ తో ఏకంగా వందల కోట్లు నష్టపోయారు.

ఇండస్ట్రీలో సీక్వెల్ అంటే మొన్నటి వరకు ఒకరకమైన ఒపీనియన్ ఉండేది. కానీ, సీక్వెల్ తో హిట్టు కొట్టి చూపించారు. కానీ, ఎందుకో ఒక ప్రొడక్షన్ హౌస్ మాత్రం సీక్వెల్ తో భారీగా నష్టపోతోంది. పైగా తాజాగా ఒక ఫ్లాప్ ని కూడా అందుకుంది. అది మరే బ్యానరో కాదు.. లైకా ప్రొడక్షన్స్. అవును.. ఇప్పటివరకు నాలుగు సీక్వెల్స్ కి సంబంధించి భారీ నుంచి అతి భారీ నష్టాలు ఈ సంస్థ అందుకంట. తాజాగా భారతీయుడు 2 విషయంలో కూడా అదే రిజల్ట్ వచ్చింది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి.. ఈ సీక్వెల్ కి అసలు పొంతనే లేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇది అసలు శంకర్ సినిమాలా లేదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లైకా ప్రొడక్షన్ కి మాత్రం ఒక సీక్వెల్ డిజాస్టర్ అనే చెప్పాలి.

ఇంక గతంలో చూసుకుంటే చంద్రముఖి 2 సినిమా గురించి మాట్లాడుకోవాలి. చంద్రముఖి ఎంతో అద్భుతమైన హిట్టు సాధించిన తర్వాత దానికి సీక్వెల్ వచ్చింది. అయితే దానిలో రజినీకాంత్ నటించలేదు. ఆ సీక్వెల్ కూడా ఊహించని ఫలితాన్ని దక్కించుకుంది. అలాగే లైకా- శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.Oకి కూడా ఆడియన్స్ నుంచి ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే సొంతం చేసుకుంది. అలాగే పీఎస్ 2 సినిమా కూడా అలాంటి ఒక టాక్ తోనే ప్రేక్షకులను నిరాశ పరిచింది. సాధారణంగా సీక్వెల్ ఫ్లాప్ అయితే డైరెక్టర్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ, అసలు నష్టం జరిగితే ప్రొడక్షన్ హౌస్ కే. ఇలా లైకా ప్రొడక్షన్స్ ఏకంగా 4 సీక్వెల్స్ లో ఊహించని ఫలితాన్ని దక్కించుకుంది.

Show comments