iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈమె ఫాలోయింగ్ మాములుగా లేదు!

  • Published Nov 10, 2023 | 5:02 PM Updated Updated Nov 10, 2023 | 5:02 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పడు క్రేజీ హీరోయిన్. ఈమెకు ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇంతకు ఈ బుడ్డది ఎవరనేదే కదా మీ ప్రశ్న?

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పడు క్రేజీ హీరోయిన్. ఈమెకు ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇంతకు ఈ బుడ్డది ఎవరనేదే కదా మీ ప్రశ్న?

  • Published Nov 10, 2023 | 5:02 PMUpdated Nov 10, 2023 | 5:02 PM
ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈమె ఫాలోయింగ్ మాములుగా లేదు!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరోయిన్ల కొరత ఏ మాత్రం లేదనే చెప్పాలి. ఇతర భాషల నుంచి కొత్త కొత్త హీరోయిన్ లు టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ ల రేంజ్ కు వెళ్లి పోతున్నారు. ఇదిలా ఉంటే.. హీరోయిన్ గా రాణించేందుకు ఎంతో మంది తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అందరిలాగే ఈ బుడ్డది సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుని మొదటి చిత్రంతోనే నటన పరంగా మంచి మార్కులే కొట్టి ప్రశంసలు పొందింది. ఆ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి తనేంటో నిరూపించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ హీరోయిన్ నటన పరంగానే కాకుండా అందచందాలతో సైతం కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇంత క్రేజ్ సంపాదించుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు ఎవరనేదే కదా మీ ప్రశ్న?

మల్లేశం సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికైన గుర్తు పట్టారా.. ఆమె ఎవరో కాదు తెలుగు యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఈ మూవీ తర్వాత ఈ హీరోయిన్ కు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు మాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇక నటతోనే కాకుండా ఈ బ్యూటీ తన అంద చందాలతో సైతం కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఈ హీరోయిన్ తన ఇన్ స్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ యువకులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు.

ఈ యంగ్ హీరోయిన్ స్వస్థలం విషయానికొస్తే.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో జన్మించింది. ఆ తర్వాత హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కూడా పని చేసింది. ఇక జాబ్ చేస్తూనే నటనపై ఆసక్తిగా అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. అయితే అనన్య నటించిన షాదీ అనే షార్ట్ ఫిల్మ్ కు గాను ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా రావడం విశేషం. ఆ తర్వాత యంగ్ హీరో ప్రయదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీ ద్వారా నటన పరంగా మంచి మార్కులే దక్కినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో సహయ నటిగా ఛాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio