Swetha
Kiran Abbavaram: సోషల్ మీడియాలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా 'క' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో కిరణ్ చాలా ఆవేశంగా మాట్లాడాడు. అసలు కిరణ్ అంత ఆవేశంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి.. అతనిని బాధ పెట్టిన ఆ విషయం ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.
Kiran Abbavaram: సోషల్ మీడియాలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా 'క' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో కిరణ్ చాలా ఆవేశంగా మాట్లాడాడు. అసలు కిరణ్ అంత ఆవేశంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి.. అతనిని బాధ పెట్టిన ఆ విషయం ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.
Swetha
రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా దీని గురించి చర్చించుకుంటుంది. అయితే ఈ చర్చ సినిమా ఎలా ఉంటుంది.. కిరణ్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనే దాని గురించి కాదు. అవన్నీ పక్కన పెడితే ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం.. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఆ ఆవేశం వెనుక అతను ఎప్పటినుంచో మోస్తున్న బాధ కూడా ఉంది. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ కిరణ్ మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ ట్రోల్స్ కాస్తా మితిమీరడంతో.. కిరణ్ అలాంటి వారికి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. దీనితో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది చర్చకు దారితీసింది. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఒక సినిమాలో కనీసం తన పర్మిషన్స్ , ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తనని ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. దీనితో అసలు ఆ సినిమా ఏంటి.. ఆ ట్రోల్ చేసిన సీన్ ఏంటి.. అని అంతా ఆరా తీయడం స్టార్ట్ చేశారు.
ఆ సినిమా మరేదో కాదు.. గత ఏడాది రిలీజ్ అయిన కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్. ఆ మూవీ ఓపెనింగ్ సీన్ లో ఇద్దరు హాస్టల్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్ అబ్బవరం ట్రైలర్ రిలీజ్ అయిందని ఒక్కడంటే.. ఏంటి మళ్ళినా! అంటూ ఇంకొకడు వెటకారంగా అంటాడు. అప్పట్లో కిరణ్ అబ్బవరం వెంట వెంటనే మూవీస్ తీస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మూవీలో అతని మీద సెటైర్ వేశారు. ఇదే విషయాన్నీ కిరణ్ అబ్బవరం ఇన్ని నెలల తర్వాత ప్రస్తావించారు. అయితే అతను ఎక్కడా కూడా మూవీ నేమ్ కానీ.. మేకర్స్ పేర్లు కానీ తీసుకురాలేదు. కానీ , తను హర్ట్ అయినట్లు మాత్రం కిరణ్ చాలా క్లియర్ గా అందరి ముందు వ్యక్తపరిచాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం స్పీచ్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. ట్రోలర్స్ నోర్లు మూయిస్తుంది.
గతంలో కూడా ఎన్నో ట్రోల్స్ వచ్చినా స్పందించని కిరణ్.. ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఆవేశ పడడంతో.. అందరు దీని గురించి చర్చించుకుంటున్నారు. మీడియా , సోషల్ మీడియా లో ట్రోల్స్ గురించి పక్కన పెడితే.. ఆ హీరో పర్మిషన్ లేకుండా సినిమాలోనే ట్రోల్ చేయడం అనేది సరైనది కాదు. మరి ఇప్పటికైనా మూవీ టీం కిరణ్ అబ్బవరంకు క్షమాపణలు చెప్తారా.. లేదా ఈ విషయం ఇంకా ఎక్కడికైనా దారి తీస్తుందా.. అనేది తెలియాల్సి ఉంది. చూస్తూ పోనిలే అని వదిలేయడానికి ఇలాంటి ట్రోలింగ్స్ చిన్న విషయాలుగా ఆగిపోవడం లేదని..అది క్రమంగా ఓ ట్రెండ్ గా మారిపోతుందని.. ఏకంగా కొన్ని ఛానెల్స్ కేవలం ట్రోల్స్ తోనే బ్రతికేస్తున్నాయని.. కిరణ్ అబ్బవరం ఇప్పటికైనా వ్యక్తపరిచి మంచి పని చేశాడని.. తన అభిమానులు భావిస్తున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.