Nithya Menen: ఈ పాపని గుర్తు పట్టారా? స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. దేశం గర్వించదగ్గ నటి

ఈ పాపని గుర్తు పట్టారా? స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. దేశం గర్వించదగ్గ నటి

ఈ పాప మల్టీ టాలెంటర్.. నటన ప్రాధాన్యముండే చిత్రాలను ఎంపిక చేసుకుంది. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. గ్లామర్ రోల్స్ కు మొహమాటం లేకుండా నో చెబుతుంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది.

ఈ పాప మల్టీ టాలెంటర్.. నటన ప్రాధాన్యముండే చిత్రాలను ఎంపిక చేసుకుంది. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. గ్లామర్ రోల్స్ కు మొహమాటం లేకుండా నో చెబుతుంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది.

పరాయి ఇండస్ట్రీ నుండి వచ్చిన అమ్మాయిల్ని త్వరగా ఓన్ చేసుకున్నప్పటికీ.. మన అమ్మాయి అన్న ఫీలింగ్ ఉండదు. కానీ ఇదిగో ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప..  నటిగా ఎంట్రీ ఇచ్చిన తొలి మూవీతోనే.. తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్టు నుండి కెరీర్ స్టార్ చేసి జర్నలిస్ట్ కావాలని అనుకుంది. కానీ తాను ఒకటి అనుకుంటే దైవం మరోటి తలచింది. మళ్లీ చిత్ర రంగం వైపు అడుగులు వేసి.. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటిగా మారింది. అర్థమౌంది కదా ఎవరో.. మన పక్కింటి అమ్మాయిలా తలపించే నిత్యామీనన్. పేరుకు కేరళ కుట్టీ అయినప్పటికీ.. తొలి మూవీతోనే తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరి చూపు తన వైపుకు తిప్పుకుంది. ఉంగరాల్లాంటి చుట్టూ, బొంగరం లాంటి కళ్లతో, కల్మషం లేని చిరునవ్వు, సెటిల్ట్ ఫెర్మామెన్స్‌తో కట్టిపడేస్తుంది.

70వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా నిలిచింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ నిత్యా మీనన్. మరో నటి మానసి పరేఖ్ కూడా ఉత్తమ నటిగా నిలిచింది. ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రంబలం (తెలుగులో తిరు)లో ఆమె నటనకు గానూ ఈ అవార్డును కొల్లగొట్టింది. నిజం చెప్పాలంటే.. ఆమెకు ఎప్పుడో ఈ అవార్డు రావాల్సింది. కానీ లేట్ అయ్యింది. ఇప్పటికైనా వచ్చినందుకు నిజంగా కంగ్రాట్స్ చెప్పొచ్చు. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే బెంగళూరులో మలయాళీ ఫ్యామిలీకి పుట్టిన నిత్యా.. విద్యాభ్యాసం అంతా బెంగళూరులో కొనసాగింది. చిన్నప్పుడు‘ది మంకీ హు న్యూ టు మచ్​’ (హనుమాన్) అనే ఇంగ్లీష్​ చిత్రంలో టబు సోదరిగా నటించింది. ‘7 ఓ క్లాక్’ సపోర్టింగ్ రోల్ చేసింది. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిస్ట్‌ విద్యను పూర్తి చేసిన నిత్య.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంది. కానీ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి మూవీ ఆఫర్ చేయగా.. అలా మొదలైందితో ఆమె సినీ కెరీర్ అలా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి గాను బెస్ట్ యాక్టరస్‌గా నంది అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకుంది. నటనకు ప్రాధాన్యముండే పాత్రలో నటించే నిత్యా.. భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో నటించలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌, నాని అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌత్ మొత్తం చుట్టేసి.. హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే ఓ ఇంగ్లీష్ మూవీలో కూడా నటించింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మల్టీ టాలెంటర్.. కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా. తెలుగు కాకుండా మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నిత్యా. ఆమె జాతీయ అవార్డు దక్కడంతో హోల్ ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తుంది.

Show comments