iDreamPost
android-app
ios-app

నానా హైరానా అంటూ గేమ్ ఛేంజ్ చేస్తున్న మ్యూజిక్ మెలోడీ

  • Published Nov 29, 2024 | 4:25 PM Updated Updated Nov 29, 2024 | 4:25 PM

Game Changer: నానా హైరానా అంటూ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన మెలోడీ మ్యాజిక్.. నిజంగానే సోషల్ మీడియాలో నానా హైరానా చేస్తుంది. ఈరోజుల్లో ఇలాంటి ఓ ప్యూర్ మెలోడీ సాంగ్ రావడం చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ అంచనాలను ఇంకో మెట్టు ఎక్కించడానికి ఈ మెలోడీ సాంగ్ వచ్చేసింది.

Game Changer: నానా హైరానా అంటూ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన మెలోడీ మ్యాజిక్.. నిజంగానే సోషల్ మీడియాలో నానా హైరానా చేస్తుంది. ఈరోజుల్లో ఇలాంటి ఓ ప్యూర్ మెలోడీ సాంగ్ రావడం చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ అంచనాలను ఇంకో మెట్టు ఎక్కించడానికి ఈ మెలోడీ సాంగ్ వచ్చేసింది.

  • Published Nov 29, 2024 | 4:25 PMUpdated Nov 29, 2024 | 4:25 PM
నానా హైరానా అంటూ గేమ్ ఛేంజ్ చేస్తున్న మ్యూజిక్ మెలోడీ

నానా హైరానా అంటూ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన మెలోడీ మ్యాజిక్.. నిజంగానే సోషల్ మీడియాలో నానా హైరానా చేస్తుంది. ఈరోజుల్లో ఇలాంటి ఓ ప్యూర్ మెలోడీ సాంగ్ రావడం చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ అంచనాలను ఇంకో మెట్టు ఎక్కించడానికి ఈ మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయినా రెండు పాటలకంటే కూడా ఈ సాంగ్.. అందరికి అద్భుతంగా ఆకట్టుకుంది. విన్న మొదటి సారికే ప్రేక్షకులంతా పాజిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎందుకంటే ఫుల్ సాంగ్ రిలీజ్ కు ముందే.. సింగర్స్ పాడిన రెండు మూడు లైన్స్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. అప్పటికి సాంగ్ పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ బజ్ కు తగ్గట్టే అదరగొట్టేసింది.

నానా హైరానా .. ప్రియమైన హైరానా.. అంటూ స్మూత్ గా సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ ను.. రామజోగయ్య శాస్త్రి రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ట్యూన్ అందించగా.. య ఘోషాల్, కార్తీక్ పాడారు. ఈ సినిమాలో ఈ సాంగ్ కచ్చితంగా ఆడియన్స్ కు ఓ మంచి ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. కేవలం ఆడియో పరంగానే కాదు. విజువల్స్ పరంగా కూడా ఫ్రేమ్స్ అదిరిపోయాయని మూవీ లవర్స్ చెబుతున్నారు. ఇక్కడ శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుందని అంతా అంటున్నారు. గతంలో ఓసారి శంకర్ కూడా ఈ సాంగ్ ను మూవీ ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీతో షూట్ చేశామని, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పారు. ఇప్పుడు సాంగ్ రిలీజ్ తర్వాత శంకర్ చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించాడని అందరికి అర్థమైంది. సో సినిమా మీద అక్కడక్కడ ఉన్న భయాలు కూడా తొలగిపోయాయని చెప్పి తీరాల్సిందే.

ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మాస్ , మసాలా సాంగ్స్ కు ఏ రకంగా ఇష్టపడుతున్నారో.. మెలోడీ సాంగ్స్ ను అంతకంటే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ విన్న మొదటి సారే ప్రేక్షకులకు ఎక్కేసింది. పైగా థమన్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన మెలోడి సాంగ్ ఇది. మొత్తానికి ఈ మెలోడీ ఎదో మ్యాజిక్ చేసింది.. గేమ్ చేంజ్ చేసిందని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది . అటు ప్రమోషన్స్ ప్లాన్ కూడా రెడీ గా ఉంది. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet