iDreamPost
android-app
ios-app

నేషనల్ అవార్డ్స్ దోచుకెళ్లి.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన దొంగలు!

Thieves Returned The National Awards: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఇంట్లో దొంగలు పడ్డారంట. అతడికి వచ్చిన అవార్డులతో పాటుగా డబ్బు, నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.. చివర్లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

Thieves Returned The National Awards: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఇంట్లో దొంగలు పడ్డారంట. అతడికి వచ్చిన అవార్డులతో పాటుగా డబ్బు, నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.. చివర్లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

నేషనల్ అవార్డ్స్ దోచుకెళ్లి.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన దొంగలు!

ప్రస్తుత కాలంలో దొంగల చేతివాటం ఎక్కువైపోయింది. సామాన్యులతో పాటుగా సెలబ్రిటీల ఇళ్ళకు కూడా కన్నాలు వేస్తున్నారు గజ దొంగలు. కంటికి కనిపించినకాడికి దోచుకుని ఊడాయిస్తున్నారు. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఇంట్లో దొంగలు పడ్డారంట. అతడికి వచ్చిన అవార్డులతో పాటుగా నగలు, డబ్బును దోచుకెళ్లారట చోరులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఇక్కడే ఓ భారీ ట్విస్ట్ ఇచ్చారు దొంగలు. దొంగలు సైతం తమలో ఉన్న కొద్దొగొప్పో మంచితనాన్ని చూపించారు. అసలేం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎం. మణికందన్ తమిళంలో కాక్కా ముట్టై, కడైసి వివసాయి లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మూవీస్ కు మణికందన్ కు నేషనల్ అవార్డులు సైతం వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ దర్శకుడి ఇంట్లో దొంగలు పడ్డారట. మధురై ఉసియాంపట్టిలో ఉన్న మణికందన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ టైమ్ లో ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉన్నారట. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటుగా సదరు డైరెక్టర్ కు వచ్చిన జాతీయ అవార్డులను కూడా ఎత్తుకెళ్లారట దొంగలు. ఈ సంఘటనపై ఉసిలంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్శకుడు మణికందన్. పోలీసులు కూడా విచారణ చేపట్టారు.

National Awards robbed

కాగా.. దొంగతనం చేసిన కొన్ని రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దొంగలు. నేషనల్ అవార్డులను తిరిగి ఆయన ఇంటికే పంపించారు మంచి దొంగలు. అవార్డులతో పాటుగా ఓ లెటర్ కూడా రాశారు. అందులో ‘మమ్మల్ని క్షమించండి సర్.. ఇది మీ కష్టార్జితం’ అని రాసి ఉందట. అయితే అవార్డులను, మెడల్స్ ను తిరిగి ఇచ్చేసిన ఈ మంచి దొంగలు బంగారం, డబ్బులు మాత్రం ఇవ్వకపోవడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా ఆ దొంగలు సినిమా పిచ్చొళ్లు అనుకుంటా, లేకపోతే అవార్డులు, మెడల్స్ ఎందుకు ఇచ్చేస్తారు.. అంటూ రాసుకొస్తున్నారు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు.. నేషనల్ అవార్డులు తిరిగి ఇచ్చారు సంతోషించండి సార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి