iDreamPost
android-app
ios-app

ఈ విజేతల్లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. గుర్తు పట్టారా..?

  • Published Feb 02, 2024 | 6:49 PM Updated Updated Feb 02, 2024 | 6:49 PM

ఈ ఫోటోలో ముగ్గురు చిన్నారులున్నారు కదా.. అందులో టాప్ ప్లేసులో నిల్చొన్న బ్యూటీని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్. ఈ పిక్ చూస్తుంటే చిన్నప్పటి నుండే చదువు, ఆట పాటల్లో మేటి అనుకుంటా.. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో ముగ్గురు చిన్నారులున్నారు కదా.. అందులో టాప్ ప్లేసులో నిల్చొన్న బ్యూటీని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్. ఈ పిక్ చూస్తుంటే చిన్నప్పటి నుండే చదువు, ఆట పాటల్లో మేటి అనుకుంటా.. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Feb 02, 2024 | 6:49 PMUpdated Feb 02, 2024 | 6:49 PM
ఈ విజేతల్లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. గుర్తు పట్టారా..?

ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్.. వెల్ ఎడ్యుకేటెడ్. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి రావాలనుకున్నప్పుడే.. ఇండస్ట్రీలోని సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఓ అంచనా వేయగలుగుతున్నారు కొంత మంది హీరోయిన్స్. అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుని.. తల్లిదండ్రులను ఒప్పించుకుంటున్నారు. పేరెంట్స్ సూచనల మేరకు ముందు చదువులు ముగించి.. ఆ తర్వాత ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నటిగా రాణించలేకపోతే.. తమ ఎడ్యుకేషన్‌కు తగ్గట్లు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కొంత మంది హీరోయిన్లు స్వతహాగానే చిన్నప్పటి నుండే చదువు సంధ్యల్లోనే కాదూ ఆట పాటల్లోనూ సత్తాను చాటుతుంటారు. అలాగే స్కూల్, కాలేజీ యానివర్సరీల్లో తమ నటనా ప్రావీణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

ఇదిగో ఈ ఫోటోలో టాప్ ప్లేసులో కనిపిస్తున్న చిన్నారిని చూశారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. చూస్తుంటే ఆటల్లో, చదువుల్లో టాప్‌లా కనిపిస్తుంది. రెండు జడలు వేసుకుని నంబర్ 1 ప్లేసులో నిల్చుని చిరు నవ్వులు చిందిస్తున్న ఈ పాప ఎవరో గుర్తు పట్టారా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో యాక్ట్ చేసింది. తెరంగేట్రమే టాప్ డైరెక్టర్‌తో జరిగింది. ఇక్కడే కాదూ బాలీవుడ్‌లో కూడా దూసుకెళ్లి.. అక్కడ కూడా అమితాబ్, షారూఖ్ వంటి టాప్ హీరోల పక్కన నటించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. తాప్సీ పన్ను.  హీరోలకు లక్కీ డైరెక్టర్‌గా ముద్ర పడ్డ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ సుందరి.

మంచు హీరోలతో పాటు రవితేజ, ప్రభాస్, గోపి చంద్, వెంకటేష్, రానా వంటి టాప్ టాలీవుడ్ స్టార్స్ పక్కన ఆడి పాడింది. బీ టౌన్ ఇండస్ట్రీలోకి వెళ్లి.. ఉమెన్ సెంట్రిక్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. పింక్ మూవీలో అమితాబ్‌తో నటించిన ఆమె.. రీసెంట్‌గా షారూఖ్ సరనస డుంకీలో కనిపించింది. అయితే అమ్మడిలో కాస్తంత గోరోచనం(యాటిట్యూడ్) ఎక్కువయ్యి.. ఎవరైతే ఆమెను స్టార్ నటిగా మార్చారో.. ఆ టాలీవుడ్ ఇండస్ట్రీపైనా, ఇక్కడ దర్శకులపైనా, నటులపై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. రాఘవేంద్రరావుపై గతంలో నెగిటివ్ కామెంట్స్ చేసింది. నిన్నటికి నిన్న యానిమల్ మూవీ, ఆ సినిమా హీరోయిన్.. రష్మిక మందన్నాపై నోరు పారేసుకుంది.  రష్మికలా నటించలేనంటూ.. ఆ మూవీలో తాను యాక్ట్ చేయనంటూ మాట్లాడింది. అయితే ఆమెకు యానిమల్ డైరెక్టర్  సందీప్ ఫ్యాన్స్ గట్టిగానే ఇచ్చి పడేశారనుకోండి. ఇక్కడ స్టార్ డమ్ సంపాదించి.. అక్కడకు వెళ్లాక.. ఇలా మాట్లాడటం ఆమెను ఆమె ప్రశ్నించుకోవాలి మరీ.. ఏమంటారూ..?

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş