iDreamPost
android-app
ios-app

దసరాకు కొత్త దేవర.. వాటి కోసమే అయ్యుంటుందా!

  • Published Sep 30, 2024 | 5:09 PM Updated Updated Sep 30, 2024 | 5:09 PM

Devara Movie: దేవర థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించేస్తుంది. ఎక్కడ చూసినా దేవర గురించే టాక్ వినిపిస్తుంది. సరే ఇదంతా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు దేవర నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Devara Movie: దేవర థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించేస్తుంది. ఎక్కడ చూసినా దేవర గురించే టాక్ వినిపిస్తుంది. సరే ఇదంతా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు దేవర నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 30, 2024 | 5:09 PMUpdated Sep 30, 2024 | 5:09 PM
దసరాకు కొత్త దేవర..  వాటి కోసమే  అయ్యుంటుందా!

దేవర కథ ఏంటో తెలుసుకోవాలని అనుకున్న రోజు నుంచి.. దేవర గురించి కథ కథలుగా చెప్పుకునే రోజులు వచ్చేశాయి. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన దేవర.. అందరిని మెప్పించింది. థియేటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. దేవర రీసౌండ్ కు బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతుంది. మొదటి షో తర్వాత డివైడ్ టాక్ వచ్చినా.. రెండు మూడు షోస్ తర్వాత అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారు. ఏం సినిమారా బాబు మైండ్ లో నుంచి పొవట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరే నిజమే దేవర నిజంగానే హిట్ కొట్టింది.. ఇదంతా తెలిసిన విషయమే.. కొత్తగా ఏముంది అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. అదేంటంటే దసరాకు దేవర మళ్ళీ కొత్తగా రిలీజ్ కాబోతుందని సమాచారం. మరి ఆ విషయాలేంటో చూసేద్దాం.

దేవర విషయంలో అన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఓ రెండు సార్లు చూసేశాం.. సో ఇంకా రిలాక్స్ అవ్వొచ్చు. ఇలా అనుకుంటే సినిమాలో కొత్తగా యాడ్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం చూశాం కదా ఇంకా కొత్త ఎలిమెంట్స్ ఏంటి అనుకుంటున్నారా. ఏంటంటే.. మూవీ రిలీజ్ కు ముందు డావుడి సాంగ్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఈ సాంగ్ కు తారక్ అభిమానులు చొక్కాలు చించేస్కున్నారు. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా థియేటర్ లో రచ్చ రచ్చ చేయాల్సిందే అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సాంగ్ సినిమాలో కాదు కదా కనీసం ఎండ్ టైటిల్స్ లో కూడా ఉండదని షాక్ ఇచ్చారు మేకర్స్. దీనితో అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు. ఆయుధ పూజతో ఎడ్జ్జస్ట్ అయ్యారు. అలాగే జాన్వీ కపూర్ రోల్ గురించి కూడా బాగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడంతో కాస్త నిరాశ చెందారు. కానీ ఇప్పుడు మాత్రం.. అభిమానులందరినీ మరో సారి థియేటర్స్ కు రప్పించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

సాధారణంగా ఒకప్పుడు థియేటర్స్ లో మూవీ లాంగ్ రన్ లో మైంటైన్ చేయడానికి.. కొద్దీ రోజుల తర్వాత కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవర విషయంలోనూ ఇదే రిపీట్ కాబోతుందట. ఏ విషయంలో అయితే ఆడియన్స్ అప్సెట్ అయ్యారో.. వాటిని మూవీలో యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ యాడెడ్ వెర్షన్స్ తో దసరా నుంచి కొత్తగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇది కనుక జరిగితే మరోసారి అభిమానులు థియేటర్స్ కు పోటెత్తడం ఖాయం. మరి ఏమౌతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎలాంటి సినిమాలు పోటీకి లేవు కాబట్టి.. దసరా వరకు లాంగ్ రన్ ఉంటుందనుకున్నారు. కానీ ఇలా యాడెడ్ వెర్షన్ రిలీజ్ అయితే మాత్రం.. దసరా తర్వాత కూడా దేవరకు తిరుగులేదని చెప్పొచ్చు. దసరా కు కొత్త దేవర వస్తాడో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet