iDreamPost
android-app
ios-app

Krish 4: గుడ్ న్యూస్! మరోసారి తెరపైకి క్రిష్! మార్వెల్స్ రేంజ్ లో క్రిష్-4

  • Published May 04, 2024 | 6:55 PM Updated Updated May 04, 2024 | 6:55 PM

ఇప్పటివరకు హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తెరకెక్కాయి. అవి సిరీస్ లు గా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, హాలీవుడ్ లో ఎన్ని సిరీస్ లు వచ్చినా కూడా.. ప్రతి ఒక్కరికి "క్రిష్" సిరీస్ అనేది ఓ స్పెషల్ ఎమోషన్. తాజాగా దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది.

ఇప్పటివరకు హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తెరకెక్కాయి. అవి సిరీస్ లు గా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, హాలీవుడ్ లో ఎన్ని సిరీస్ లు వచ్చినా కూడా.. ప్రతి ఒక్కరికి "క్రిష్" సిరీస్ అనేది ఓ స్పెషల్ ఎమోషన్. తాజాగా దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది.

  • Published May 04, 2024 | 6:55 PMUpdated May 04, 2024 | 6:55 PM
Krish 4:  గుడ్ న్యూస్! మరోసారి తెరపైకి క్రిష్! మార్వెల్స్ రేంజ్ లో క్రిష్-4

హాలీవుడ్ లో సూపర్ హీరోస్ తరహాలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్పైడర్ మ్యాన్ , సూపర్ మ్యాన్ , బ్యాట్ మ్యాన్ ఇలా సూపర్ హీరోస్ చిత్రాలన్నీ కూడా సీజన్స్ వారీగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక ఇప్పుడున్న జెనెరేషన్ అందరికి కూడా సూపర్ హీరోస్ అంటే.. ది బాయ్స్, మార్వెల్ అంటూ రకరాల సిరీస్ లు చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే అటు హాలీవుడ్ ప్రేక్షకులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకమైన సిరీస్ మాత్రం హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ అని చెప్పి తీరాలి. క్రిష్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్ మూవీ అని చెప్పడం కంటే అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు . అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికి మూడు పార్ట్స్ వచ్చాయి. వచ్చిన ప్రతి పార్ట్ సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు క్రిష్ -4 రాబోతుందని టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హాలీవుడ్ చిత్రాలు మన దగ్గర భారీ విజయాలను అందుకోవడం అనేది చాలా రేర్. కానీ, ఆ విషయంలో క్రిష్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సూపర్ హీరో కమ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ రూపంలో తెరకెక్కించిన చిత్రం క్రిష్. ఇప్పటికీ ఈ సినిమాలను టెలివిజన్ లో వస్తుంటే.. అసలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే, క్రిష్ -3 తోనే ఆగిపోయిన ఈ సిరీస్ ను ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తారనే టాక్ బాగా నడుస్తుంది. అంటే త్వరలో క్రిష్-4 రాబోతుందన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ఒకవేళ క్రిష్ 4 వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ లో సూపర్ హీరోస్ ఫాంటసీ చిత్రాలకు నడుస్తున్న ట్రెండ్ అంతా ఇంతా కాదు. కాబట్టి ఈ టైమ్ లో అందరికి ఎంతో ఇష్టమైన క్రిష్ సిరీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ కు సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారట.

ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో.. “అతను వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో అంటూ హృతిక్ రోషన్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. దానికి “అవును అతను వస్తున్నాడు” అంటూ సిద్ధార్థ్‌ ఆనంద్‌ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తుంది. కానీ దీని గురించి ఇంకా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం హృతిక్ వార్ -2 తో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా తర్వాత క్రిష్-4 గురించి ఏమైనా అప్ డేట్ ఇస్తారేమో వేచి చూడాలి. మరి క్రిష్ 4 గురించి సోషల్ మీడియాలో వస్తున్న అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş