iDreamPost
android-app
ios-app

పేరు మార్చుకున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఇకనైనా కలిసి వచ్చేనా!

  • Published May 09, 2024 | 4:06 PM Updated Updated May 09, 2024 | 4:06 PM

ఇటీవల సామాన్యల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారులు తమకు అదృష్టం కలిసి రావాలని న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు.

ఇటీవల సామాన్యల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారులు తమకు అదృష్టం కలిసి రావాలని న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు.

  • Published May 09, 2024 | 4:06 PMUpdated May 09, 2024 | 4:06 PM
పేరు మార్చుకున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఇకనైనా కలిసి వచ్చేనా!

ఈ మధ్య చాలామంది తాము ఏం చేసినా టైమ్ కలిసి రావడం లేదని తమ జీవితంలో ఏదైనా లోపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. కంతమంది న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మంత్రగాళ్లను నమ్ముకుంటున్నారు.న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లు మార్చుకుంటే చాలా వరకు అనుకున్నది సాధిస్తామని.. తమకు అదృష్టం కలిసి వస్తుందని సామాన్యుల నెంచి సంపన్నుల వరకు నమ్ముతున్నారు. చాలా మంది సెలబ్రెటీలు కూడా న్యూమరాలజీని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంది. వివరాల్లోకి వెళితే..

తమకు అదృష్టం కలిసి రావడం లేదని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం పేరులో మార్పు చేసుకుంటే టైమ్ కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే దేశ వ్యాప్తంగా ఎంతో మంది న్యూమరాలజిస్టులు పుట్టుకువస్తున్నారు. ఈ మద్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పేరు మార్చుకోవడం అనే మాట బాగా వినిపిస్తుంది. ఈ లీస్టులో చేరింది బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి. ఆ మధ్య రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారే ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తనదైన గేమ్ తో ప్రేక్షకులను అలరించింది. ఎప్పుడూ తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మనసు దోచే ఈ అమ్మడు ఇప్పుడు తన పేరు లో అక్షరాన్ని మార్చుకొని మరోసారి వార్తల్లో నిలిచింది.

అషు రెడ్డి (Ashu Reddy) ని న్యూమరాలజీ ప్రకారం ఆషు రెడ్డి (Aashu Reddy) గా మార్చుకుంది. తన పేరులో కొత్తగా A అక్షరాన్ని యాడ్ చేసింది. ఇటీవల పలు రియార్టీ షోలు, యాడ్స్, ఫోటో షూట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో కనిపించినా.. ఈ అమ్మడికి పెద్దగా కలిసి రావడం లేదని.. అందుకే తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటే టైమ్ కలిసి ఈ పని చేసినట్లు తెలిపింది.మరి ఈ మార్పు తరువాతనైనా ఆషు రెడ్డికి అవకాశాలు కలిసి వస్తాయా లేదా అన్నది ముందు ముందు చూడాలి. ప్రస్తుతం ఆషు రెడ్డి యేవన్ అనే మూవీలో నటిస్తుంది. ఈ సినిమా తో ఆషు రెడ్డికి మంచి పేరు వస్తే న్యూమరాలజీ వర్క్ ఔట్ అయినట్లే అంటున్నారు అభిమానులు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom