Aditya N
సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇప్పటికే సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇప్పటికే సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
Aditya N
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ సినిమా కంగువ. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిషా పటానీ, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంబందించిన తాజా టీజర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఇటీవల ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఏర్పాటు చేసిన మార్క్యూ ఈవెంట్ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన ఎలక్ట్రిఫైయింగ్ టీజర్‌ను విడుదల చేశారు.
స్వతహాగా మాస్ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు శివ (సిరుతై శివ) టీజర్ లో తన టేకింగ్, అద్భుతమైన విజువల్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇది ఇప్పటికే సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచింది. కంగువ సినిమాకి తమ మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించే పనిలో ఉన్న నిర్మాత ధనంజయన్, కొత్త టీజర్‌కు చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందని వెల్లడించారు. కంగువ – సిజిల్ పేరుతో విడుదలైన టీజర్ ప్రేక్షకులు ఆశించే హై-వోల్టేజ్ లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ను అందించింది. సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా వీక్షకులను బాగా ప్రభావితం చేశాయని నిర్మాత అన్నారు.
కంగువ అందరిలోనూ ఉత్కంఠను సృష్టించడానికి కారణం ఆ ప్రపంచాన్ని బాగా చూపించడమే అని ధనంజయన్ అన్నారు. అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని, ముఖ్యంగా మొసలి కన్ను చూపించిన షాట్ ను ఎంతో మంది మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. మరి కొంత మందికి పులిని చూపించిన షాట్ చాలా వాస్తవంగా వచ్చిందని చెప్పారు. అయితే సినిమా షూటింగ్ లో నిజమైన పులితోనే చేశామని తెలిపి ఆశ్చర్యపరిచారు. ముందుగా కావాల్సిన అనుమతి తీసుకొని నిజమైన పులితో సీన్ షూట్ చేసి, ఆపై దానిని గ్రాఫిక్స్ తో తీర్చిదిద్దామని స్టూడియో గ్రీన్ సిఈవో అయిన ధనంజయన్ అన్నారు. “ఈ చిత్రం బాహుబలి కంటే పెద్ద సినిమాగా ఉందని చాలా మంది పేర్కొన్నారు. సూర్య సర్ తో పాటు బాబీ డియోల్ సహా ఈ సినిమాకి పని చేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుల కెరీర్‌లో ఇది ఒక అద్భుతమైన చిత్రం అవుతుంది” అని ఆయన చెప్పారు.
కంగువ సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కుతోంది. శివ రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ దాదాపు 500 సంవత్సరాల టైంలైన్ ను కలిగి ఉంటుంది. ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో సూర్య, బాబీ డియోల్ ద్విపాత్రాభినయం చేయనున్నారని గట్టి టాక్ వినిపిస్తుంది. వారి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు.