iDreamPost
android-app
ios-app

మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన నటుడు

  • Author Soma Sekhar Updated - 12:19 PM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Updated - 12:19 PM, Wed - 14 June 23
మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన నటుడు

ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగాడు ఓ నటుడు. అయితే కొద్ది సేపటికే ఆ వీడియోను తొలగించాడు. గతంలో కూడా ఈ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు మహిళ డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తూ.. తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆ వీడియోలో అతడు వాపోయాడు.ఇక ఈ వీడియోను చూసిన అతడి ఫ్రెండ్స్ హుటాహుటిన ఇంటికి చేరుకోగా.. ఆ నటుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. దాంతో అతడిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా ‘ది కపిల్ శర్మ షో’ ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ షోలో స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటుగా నటుడు, కమెడియన్ తీర్థానంద్ రావ్ కూడా కో-హోస్ట్ గా వ్యవహరిస్తుండటం మనకు తెలిసిందే. తనదైన ఇమిటేషన్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు తీర్థానంద్ రావ్. అయితే ఓ మహిళ తనను డబ్బులు ఇవ్వమంటూ బ్లాక్ మెయిల్ చేస్తోందని, తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని తాజాగా తీర్థనంద్ రావు ఫేస్ బుక్ లైవ్ లోనే విషం తాగారు.. తనపై పోలీసులకు సైతం సదరు మహిళ కంప్లైంట్ ఇచ్చిందని ఈ లైవ్ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఈ లైవ్ వీడియోను చూసిన అతని ఫ్రెండ్స్ తీర్థానంద్ రావు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అతను అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. కాగా తీర్థానంద్ రావు గతంలోనూ ఓసారి ఆత్మహత్యకు యత్నించారు. అప్పట్లో ఆర్థిక కారణాల చేత ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోను కొద్ది సేపటికే డిలిట్ చేశారు తీర్థానంద్ రావు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో తెలియల్సి ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet