iDreamPost
android-app
ios-app

హీరోయిన్ లేటుగా వచ్చిందని.. రాళ్ల దాడి చేసిన ఫ్యాన్స్..!

  • Published Jan 18, 2024 | 9:34 PM Updated Updated Jan 18, 2024 | 9:34 PM

హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఓ నటి ఓ ఈవెంట్ కు కాస్త ఆలస్యంగా వెళ్లింది. ఆమెను చూసేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆమె లేటుగా రావడంతో..

హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఓ నటి ఓ ఈవెంట్ కు కాస్త ఆలస్యంగా వెళ్లింది. ఆమెను చూసేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆమె లేటుగా రావడంతో..

  • Published Jan 18, 2024 | 9:34 PMUpdated Jan 18, 2024 | 9:34 PM
హీరోయిన్ లేటుగా వచ్చిందని.. రాళ్ల దాడి చేసిన ఫ్యాన్స్..!

ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో.. హీరోయిన్లకు కూడా అంతే. నటీమణుల యాక్టింగ్‌కు ఫిదా అయిపోతే వీరి హృదయాల్లో గుడి కట్టేసుకుంటారు కుర్రకారు. కానీ ఇది ఒక్కొక్కసారి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటుంది. షాప్ ఓపెనింగ్స్, సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాల సమయంలో హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు.. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ప్రయత్నించి.. వారిని అనుచితంగా టచ్ చేస్తూ.. ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ నటికి కూడా చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ సందర్భంగా హాజరైన ప్రేక్షకులు.. చివరకు ఆమెకు చుక్కలు చూపించారు. ఇంతకు ఆ నటి ఎవరంటే..?

భోజ్ పురి నటి అక్షర సింగ్‌కు ఎనలేని అభిమానులు ఉన్నారు. ఆమె సింగర్, డ్యాన్సర్ కూడా. అప్పుడప్పుడు ఈ అమ్మడు లైవ్ షోలను కూడా ఇస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్లకు భారీగా జనాభా తరలి వస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరవ్వగా.. ఎప్పటిలాగానే ఆమెను చూసేందుకు ఎగబడ్డారు జనం. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. బీహార్‌లో. ఔరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లింది. ఆమె వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. షరా మామూలుగానే ఆమె కూడా ఈ కార్యక్రమానికి లేటుగా వచ్చింది.

అంతలో అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపైకి వచ్చి ఓ పాట పాడింది. ఇంతలో ఆమెను చూసేందుకు ఎగబడ్డారు ఫ్యాన్స్. దీంతో కాస్త తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. అయినా కూడా కంట్రోల్ కాకపోవడంతో.. ఆమెను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో ఫ్యాన్స్ తిరగబడ్డారు. ఫ్యాన్స్ రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. ఆమె ఈ ఈవెంట్ కు ఆలస్యంగా రావడంతోనే అసహనానికి గురైన ఫ్యాన్స్ దాడి చేశారంటూ వాపోతున్నారు. మరీ అభిమానులు చేసిన పని సరైనదేనని అంటారా.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss