iDreamPost
android-app
ios-app

The Goat Life: శివరాజ్‌కుమార్‌తో పృథ్వీరాజ్ సినిమా?

  • Published Mar 28, 2024 | 8:47 AM Updated Updated Mar 28, 2024 | 8:47 AM

పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బెంగుళూరులో తన తాజా చిత్రం ఆడుజీవితం: ది గోట్ లైఫ్ ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు మీడియాతో తన తదుపరి చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. సినిమాలతో పాటు శివరాజ్‌కుమార్ కమిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమాల జాబితా చాలానే ఉంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బెంగుళూరులో తన తాజా చిత్రం ఆడుజీవితం: ది గోట్ లైఫ్ ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు మీడియాతో తన తదుపరి చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. సినిమాలతో పాటు శివరాజ్‌కుమార్ కమిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమాల జాబితా చాలానే ఉంది.

  • Published Mar 28, 2024 | 8:47 AMUpdated Mar 28, 2024 | 8:47 AM
The Goat Life: శివరాజ్‌కుమార్‌తో పృథ్వీరాజ్ సినిమా?

పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బెంగుళూరులో తన తాజా చిత్రం ఆడుజీవితం: ది గోట్ లైఫ్ ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు మీడియాతో తన తదుపరి చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. ఇప్పటికే ఆయన మోహన్ లాల్ ప్రథాన పాత్రలో లూసీఫర్ సినిమాకి సీక్వెల్ అయిన ఎల్2: ఎంపురాన్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తదుపరి దర్శకత్వం వహించే టైసన్ సినిమా, అలానే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఓ సినిమాకి తాను దర్శకత్వం వహిస్తానని చెప్పారు. అయితే కన్నడ సీనియర్ హీరో శివరాజ్‌కుమార్‌తో కలిసి పని చేసే ఆలోచన తనకు ఉందని తెలిపి ఆశ్చర్యపరిచారు.

శివరాజ్‌కుమార్‌తో పృథ్వీరాజ్ కలిసి పని చేయబోతున్నారనే వార్త కన్నడ అభిమానులను ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే అది ఒక సెపరేట్ సినిమా ఉంటుందా లేదా మోహన్‌లాల్ ఎంపురాన్‌లో ఒక కీలక పాత్రలో కనిపిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంపురాన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇక ఈ మలయాళ నటుడు, దర్శకుడు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో సలార్ 2: శౌర్యాంగ పర్వం సినిమాకు కూడా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ రకంగా చూసుకుంటే కన్నడ చక్రవర్తితో సినిమా తీయాలంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. మరో వైపు శివరాజ్‌కుమార్ వచ్చే నెలన్నర పాటు తన భార్య గీత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, కర్ణాటకలో ఎన్నికలు ముగిసే వరకు ఆమె పక్కనే ఉంటారు. అలాగే భైరతిరణగల్, 45 అనే రెండు చిత్రాలను కూడా పూర్తి చేసిన తరువాతే వేరే ఏదైనా కొత్త సినిమాను ఆయన ఒకే చేయగలుగుతారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున భైరతిరణగల్ సినిమా విడుదలవుతుంది.

Prthviraj

పైన ఉదాహరించిన సినిమాలతో పాటు శివరాజ్‌కుమార్ కమిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమాల జాబితా చాలానే ఉంది .తూగుదీప, రోహిత్ పడకి, లోహిత్ ఎం, రవి అరసు, ఇంకా చాలా మంది దర్శకులతో ఆయన చర్చల్లో ఉన్నారట. మరివన్నటినీ దాటుకుని శివరాజ్‌కుమార్‌ – పృథ్వీరాజ్ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

marsbahis giriş