iDreamPost
android-app
ios-app

ది గోట్ లైఫ్ 5 డేస్ కలెక్షన్స్

  • Published Apr 02, 2024 | 1:15 PM Updated Updated Apr 02, 2024 | 1:15 PM

The Goat Life: బాక్సాఫీస్ వద్ద ది గోట్ లైఫ్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ డ్రామా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది.

The Goat Life: బాక్సాఫీస్ వద్ద ది గోట్ లైఫ్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ డ్రామా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది.

  • Published Apr 02, 2024 | 1:15 PMUpdated Apr 02, 2024 | 1:15 PM
ది గోట్ లైఫ్ 5 డేస్ కలెక్షన్స్

బాక్సాఫీస్ వద్ద ది గోట్ లైఫ్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ డ్రామా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది. సీనియర్ ఫిల్మ్ మేకర్ బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఆడుజీవితం: ది గోట్ లైఫ్ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సోమవారం రోజున అతిపెద్ద కలెక్షన్‌ను నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అప్‌డేట్‌ ప్రకారం, ది గోట్ లైఫ్ సినిమా విడుదలైన మొదటి 5 రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ మార్కును రాబట్టింది.

ట్రేడ్ వర్గాల ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ – బ్లెస్సీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కేవలం సెలవు రోజుల్లో కాకుండా సాధారణ రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పట్టును చూపుతోంది. 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ రాబట్టిన ది గోట్ లైఫ్ అదే రోజున కేరళ బాక్సాఫీస్ నుండి మాత్రమే 4.75 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఈ సర్వైవల్ డ్రామా ఇప్పుడు మొదటి బాక్స్ ఆఫీస్ వద్ద సోమవారం పరీక్షలో పాస్ అయింది. అంతే కాకుండా మలయాళ సినిమాల్లో అత్యంత వేగంగా రూ. 75 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లాంగ్ రన్ ఇదే స్థాయిలో కొనసాగితే, ది గోట్ లైఫ్‌ సినిమా ఈరోజుతో (6వ రోజు) బాక్సాఫీస్ వద్ద 83 కోట్ల మార్క్ సాధిస్తుందని అంటున్నారు. అదే జరిగినట్లయితే ఈరోజు చివరి నాటికి దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా పృథ్వీరాజ్ సినిమా అధిగమించవచ్చు.

The Goat Life 5 Days

ఇక త్వరలోనే ది గోట్ లైఫ్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే మొదటి రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కును దాటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో విడుదల కానుంది. మలయాళ సినిమాలకి గల్ఫ్ మార్కెట్ లో మంచి మార్కెట్ ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ చిత్రం 200 కోట్ల టార్గెట్ ఊహించిన దాని కంటే ముందుగానే సాధించవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet