iDreamPost
android-app
ios-app

ది బర్త్ డే బాయ్ ట్రైలర్ రిలీజ్! అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది!

  • Published Jul 10, 2024 | 1:40 PM Updated Updated Jul 10, 2024 | 1:40 PM

The Birthday Boy Trailer Review In Telugu: తెలుగు సినిమాలో ఇప్పటికే చాలానే బెస్ట్ యూత్ ఎంటర్ టైనర్స్, యూత్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ది బర్త్ డే బాయ్ చిత్రం చేరుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారేమో?

The Birthday Boy Trailer Review In Telugu: తెలుగు సినిమాలో ఇప్పటికే చాలానే బెస్ట్ యూత్ ఎంటర్ టైనర్స్, యూత్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ది బర్త్ డే బాయ్ చిత్రం చేరుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారేమో?

  • Published Jul 10, 2024 | 1:40 PMUpdated Jul 10, 2024 | 1:40 PM
ది బర్త్ డే బాయ్ ట్రైలర్ రిలీజ్! అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది!

సాధారణంగా కుర్రాళ్లు అందరూ కలిసి తమ ఫ్రెండ్స్ బర్త్ డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అప్పట్లో అంటే బర్త్ డే అంటే కేక్ కటింగ్, క్రాకర్స్ పేల్చడం చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం బర్త్ డే పార్టీలు అంటే నెక్ట్స్ లెవల్లో ఉంటున్నాయి. బర్త్ డే బంప్స్ అంటూ కొట్టడాలు, బాదడాలు, ఇష్టమొచ్చినట్లు విసిరేయడం కూడా చూశాం. అయితే ఇప్పుడు ట్రెండ్ ఇంకాస్త మితిమీరిపోతోంది అని కూడా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఒక బర్త్ డే పార్టీ కాన్సెప్ట్ తోనే ఈ మూవీని తీసుకొస్తున్నారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరి.. ఆ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఈ సినిమా పేరు ది బర్త్ డే బాయ్. దీనిని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ లో కూడా అదే విషయాన్ని మళ్లీ చెప్పారు. అయితే ఈ ట్రైలర్ సినిమా ప్లాట్ ఏంటి అనేది సగటు ప్రేక్షకుడికి క్లియర్ ఐడియా వచ్చేలా చేశారు. అంటే ఈ కథ ప్లాట్ ఏంటి? ఏ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది? మీరు ఈ సినిమా నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేయచ్చు అనేది అయితే చాలా క్లియర్ గా చెప్పేశారు. అయితే కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎలాంటి ట్విస్టులు చూపిస్తారు అనేది మాత్రం ఆడియన్ ఊహకు వదిలేశారు. సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటిని ఈ ట్రైలర్ లో రివీల్ చేశారు.

ఈ సినిమా ప్లాట్ చాలా సింపుల్ గా ఉంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ఫారెన్ లో ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. అయితే ఆ సమయంలో కాస్త హద్దు దాటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ క్రమంలో బర్త్ డే బాయ్ ని ప్రమాదవశాత్తు చంపేస్తారు. దానిని ఎలా కవర్ చేయాలి అనేదానిపై కథ ముందుకు నడుస్తుంది. ఈ మూవీలో రాజీవ్ కనకాల, రవికృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే మొదట అంతా దీనిని ప్రమాదం అనుకున్నారు. ఇప్పటి వరకు ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. కానీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది నిజం కాదు అని తేలింది. అంటే ఎవరో చంపేశారు అనే కోణంలో కథను రివీల్ చేశారు.

ఈ పాయింట్ తో కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఆడియన్స్ కు ఒక రకమైన వ్యూ ఉంది. ఇప్పుడు దానికి అదనంగా ఇంకో సీరియస్ పాయింట్ ఏదో ఉంది అని ప్రేక్షకులను కూడా కన్విన్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న బజ్ చూస్తే ది బర్త్ డే బాయ్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా జులై 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి.. ది బర్త్ డే బాయ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş