Venkateswarlu
ప్రస్తుతం రైటర్‌గా.. నటుడిగా సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకుడిగా సినిమాలు చేయకపోవటం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఆ కారణాన్ని వెంకటేష్ మహా తాజాగా బయటపెట్టారు.
ప్రస్తుతం రైటర్‌గా.. నటుడిగా సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకుడిగా సినిమాలు చేయకపోవటం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఆ కారణాన్ని వెంకటేష్ మహా తాజాగా బయటపెట్టారు.
Venkateswarlu
కేరాఫ్ కంచర పాలెం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ‘వెంకటేష్ మహా’. ఈ సినిమా సాధించిన విజయంతో దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘ ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’’ అనే సినిమా చేశారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఏమైందో ఏమో కానీ, వెంకటేష్ మహా దర్శకుడిగా సినిమాలు చేయటం బాగా తగ్గించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా.. కేవలం రెండు సినిమాలకు మాత్రమే ఆయన దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం రైటర్‌గా.. నటుడిగా సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకుడిగా సినిమాలు చేయకపోవటం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఆ కారణాన్ని వెంకటేష్ మహా తాజాగా బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దర్శకుడిగా సినిమాలు చేయటం తగ్గించటానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను ఓ ప్రముఖ నటుడికి లవ్ స్టోరీ చెప్పాను. కానీ, ఆయన మాత్రం తాను పుష్పలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానని అన్నాడు. ఆ తర్వాత ఓ పెద్ద హీరోకు ఆయన టీంకు యాక్షన్ కథ చెప్పాను.
వాళ్లు ఏమన్నారంటే.. కేజీఎఫ్ లాంటి కథను ప్లాన్ చేసుకోమన్నారు. నాకేమనిపించిందంటే.. ఆ హీరో కేజీఎఫ్ కథను కాపీ కొట్టే బదులు.. ముఖాలు మార్చుకుంటే సరిపోతుంది కదా.. నేను నా ఐడియాల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యా.. అందుకే దర్శకుడిగా సినిమాలు చేయటం తగ్గించాను’’ అని అన్నారు. అయితే, వెంకటేష్ మహా కథలను వద్దన్న ఆ ఇద్దరు హీరోలు ఎవరన్నది తెలియరాలేదు. మరి, వెంకటేష్ మహా కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“I’ve narrated a love story to a notable actor. He told me that he wanted to do a film like #Pushpa.
I’ve also narrated an action story to a hero and his team. They suggested me to plan it like #KGF. My question is, he should have morphed his face with #Yash face in AI instead…
— Daily Culture (@DailyCultureYT) October 26, 2023