iDreamPost
android-app
ios-app

ఆ బడా నిర్మాత నన్ను మోసం చేశాడు.. టాలీవుడ్ హీరోయిన్..!

  • Published Feb 07, 2024 | 8:02 PM Updated Updated Feb 07, 2024 | 8:02 PM

సినిమా అవకాశాల కోసం వెతుక్కునే క్రమంలో చాలా సార్లు మోసపోతుంటారు అప్ కమింగ్ నటీమణులు. ఛాన్సులు ఇస్తామంటూ బడా దర్శక నిర్మాతలే ఆఫర్ చేస్తారు. అది నమ్మి వెళ్లాక.. అసలు విషయం తెలుస్తోంది. ఇప్పుడు ఓ హీరోయిన్..

సినిమా అవకాశాల కోసం వెతుక్కునే క్రమంలో చాలా సార్లు మోసపోతుంటారు అప్ కమింగ్ నటీమణులు. ఛాన్సులు ఇస్తామంటూ బడా దర్శక నిర్మాతలే ఆఫర్ చేస్తారు. అది నమ్మి వెళ్లాక.. అసలు విషయం తెలుస్తోంది. ఇప్పుడు ఓ హీరోయిన్..

  • Published Feb 07, 2024 | 8:02 PMUpdated Feb 07, 2024 | 8:02 PM
ఆ బడా నిర్మాత నన్ను మోసం చేశాడు.. టాలీవుడ్ హీరోయిన్..!

రంగుల ప్రపంచంలో చీకటి కోణం తెలియక మోసపోతుంటారు అప్ కమింగ్ యాక్టర్స్. నటిగా నిరూపించుకునేందుకు, హీరోయిన్‌గా ఛాన్సులు రావాలంటే.. ముందుగా మోడల్‌గానో లేదంటే చిన్నచిన్న ఆల్బమ్స్, సీరియల్స్ చేస్తూ లైమ్ లైట్‌లోకి రావాలని ఆశపడుతుంటారు. ఒకే ఒక్క ఛాన్స్ తమను తాము ఫ్రూవ్ చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావించి.. యంగ్ యాక్టర్స్‌ను ఎర వేస్తుంటారు కొంత మంది బడా దర్శక నిర్మాతలు. తాము తెరకెక్కించే ఆల్బమ్స్, సినిమాల్లో, సీరియల్లో ఛాన్సులు ఇస్తామంటూ.. అమ్మాయిలను చుట్టూ తిప్పుకుంటారు. నిజమని నమ్మి.. ఆఫర్ వచ్చిందని, ఎంతో కొంత డబ్బు వస్తుందని ఆశ పడి చేస్తుంటారు. కానీ షూటింగ్ పూర్తయినా వారికి డబ్బులు ఇవ్వరు. లేదా వారిని మరో రకంగా హింసిస్తుంటారు.

ఇవన్నీ చెప్పుకోలేరు హీరోయిన్స్. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ప్రముఖులపై ఆరోపణలు చేస్తే అవకాశాలు రావని వారికి తెలుసు. కానీ ఈ బ్యూటీ మాత్రం.. కెరీర్ తొలి నాళ్లలోనే ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే మాల్వీ మల్హోత్రా. బుల్లితెర నుండి వెండి తెరకు వచ్చిన మరో అందమే మాల్వీ. ఉదాన్ అనే టీవీ సీరియల్ చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హోటల్ మిలన్ అనే మూవీతో హిందీలో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. జోరావర్ ది జాక్విలీన్ అనే ఓటీటీలో యాక్ట్ చేసింది. అభ్యూహం అనే మలయాళీ చిత్రంలో కూడా కనిపించింది అమ్మడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.

యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ తిరగబడరా సామీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ‘యజ్ఞం’ దర్శకుడు ఎఎస్ రవి కుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈసందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ భామ.. బాలీవుడ్‪లో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి వెల్లడించింది. బీటౌన్ స్టార్ నిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్.. ఓ మ్యూజిక్ వీడియో చేయగా.. అందులో మాల్వీ నటించింది. ఈ షూటింగ్ తర్వాత ఆమెకివ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదట. ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదట. దీంతో తాను మోసపోయానని గ్రహించిందట. ఎవరూ తనలా మోసపోకూడదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించింది అమ్మడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetandyou girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom