iDreamPost
android-app
ios-app

Thanu Sri Dutta: హీరోతో ముద్దు సీన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌!

  • Published Dec 09, 2023 | 1:47 PM Updated Updated Dec 09, 2023 | 1:47 PM

తను శ్రీ దత్తా తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. తర్వాత బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అయింది. మీటూ ఉద్యమంతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది...

తను శ్రీ దత్తా తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. తర్వాత బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అయింది. మీటూ ఉద్యమంతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది...

  • Published Dec 09, 2023 | 1:47 PMUpdated Dec 09, 2023 | 1:47 PM
Thanu Sri Dutta: హీరోతో ముద్దు సీన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌!

బాలీవుడ్ హాట్ బ్యూటీ తనుశ్రీ దత్తాను.. ఇన్నేళ్లైనా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. మొదట మోడల్‌గా కేరీర్ మొదలుపెట్టిన ఈమె 2004లో ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత బాలీవుడ్‌లో ‘ఆషికి బనాయా అప్నే’ సినిమాతో వెండితెర పై అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలివుడ్‌లో అవకాశం రావడంతో అక్కడ కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు.. రియల్ స్టార్ శ్రీ హరి సరసన వీరభద్ర సినిమాలో నటించింది.

కానీ, ఇక్కడ తనుశ్రీ కి సరైన అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడే సెటిలైపోయింది. కొన్నేళ్ల క్రితం అక్కడ మీటూ ఉద్యమం అంటూ పెద్ద యుద్ధమే మొదలు పెట్టింది ఈ భామ. అలా మీటూ ఆరోపణలు చేసినందుకుగానూ చేతిలో అవకాశాలు లేక పూర్తిగా వెండితెరకే దూరమైంది. అయితే తన కేరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలో ఓ సన్నివేశం గురించి తాజాగా ఆమె మాట్లాడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ లో తనుశ్రీకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఆషికి బనాయా అప్నే. ఇటీవలే ఆ సినిమాలో ముద్దు సన్నివేశంపై ఆమె మాట్లాడుతూ..  ‘‘ ఇమ్రాన్‌తో నేను నాలుగు సినిమాల్లో నటించాను. చాకోలేట్ అనే మూవీలో మా ఇద్దరి మధ్యా ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ, ఎడిటింగ్ లో తీసేశారు. అయితే ఫస్ట్ టైమ్ అలాంటి సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బందిపడ్డాను. రెండోసారి మరీ అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నిజ జీవితంలో మా మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదు. అయితే ఇమ్రాన్‌కి అప్పటికే ‘‘ కిస్సర్ బాయ్’’ అనే ఇమేజ్ ఉంది. అయినా నాకెందుకో అతడితో అటువంటి సీన్‌లో నటించడం అంత సౌకర్యంగా అనిపించలేదు’’ అని చెప్పుకొచ్చింది.

కాగా, తనుశ్రీ దత్తా, ఇమ్రాన్ హష్మీ.. ‘ఆషికి బనాయా అప్నే’, ‘చాకొలేట్’, ‘డీప్ డార్క్ సీక్రేట్స్’ , ‘గుడ్ బాయ్.. బ్యాడ్ బాయ్’ అనే సినిమాలలో కలిసి చేశారు. తనుశ్రీ చివరిగా 2013లో వచ్చిన ‘హమ్ నే లి హై శపథ్’ సినిమాలో కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీ విషయానికి వస్తే.. ఇతడు గ్యాంగ్ స్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, ద డర్టీ పిక్చర్, శాంఘై వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిగా టైగర్ 3 మూవీలో కనిపించాడు. మరి, తోటి నటుడితో ముద్దు సన్నివేశంపై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet