iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ప్రభాస్‌తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది

  • Published Jul 10, 2024 | 3:00 AM Updated Updated Jul 10, 2024 | 3:00 AM

ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా చూస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్. దక్షిణాదిలో సినిమాలన్నింటీలో చేసిన అనుభవం ఉంది. అయితే ఆమె చేసిన తెలుగు మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇంతకు ఆ పాప ఎవరో తెలుసా...

ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా చూస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్. దక్షిణాదిలో సినిమాలన్నింటీలో చేసిన అనుభవం ఉంది. అయితే ఆమె చేసిన తెలుగు మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇంతకు ఆ పాప ఎవరో తెలుసా...

  • Published Jul 10, 2024 | 3:00 AMUpdated Jul 10, 2024 | 3:00 AM
ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ప్రభాస్‌తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలితో టాలీవుడ్ స్టామినా బాలీవుడ్‌కు మాత్రమే కాదు.. ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తీకేయ 2 వంటి చిత్రాలు టీటౌన్ స్థాయిని మరింత రెట్టింపు చేశాయి. పాన్ ఇండియా కాదు గ్లోబల్ రేంజ్‌కు చేరిపోయింది. అందుకే ముంబయి భామలే కాకుండా ఓవర్సీస్ ముద్దుగుమ్మలు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా తమ లక్ పరీక్షించుకునేందుకు ఎంతో మంది అందగత్తెలు టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇటు కన్నడ కస్తూరీలు, తమిళ పొన్నులు, కేరళ కుట్టీలు కూడా ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప కూడా ఇప్పుడు హీరోయిన్ అయ్యి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.

వస్తూ వస్తూనే బిగ్ ఆఫర్, బిగ్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. సినిమా రంగానికి చెందిన అమ్మాయి కావడంతో ఎంట్రీ ఈజీగా మారినా..తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతుంది. డైరెక్టర్ లేదా తండ్రిలా సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకున్న అమ్మడు.. చివరకు నటిగా మారింది. కానీ షూట్‌కి వెళితే ఆమె జీవితమే మారిపోయింది. అలా హీరోయిన్ అయ్యి.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. రావడంతోనే ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. మాలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్. కేరళకు చెందిన మాళవిక..సినిమాటోగ్రాఫర్ యుకె మోహనన్ కూతురు. ముంబయి విల్సన్ కాలేజీలో మాస్ మీడియా చేసిన ఆమె… తర్వాత మమ్ముట్టితో ఓ యాడ్ షూట్‌కు వెళ్లి..దుల్కర్ సరసన నటించే ఛాన్స్ పొందింది.

పట్టామ్ పోల్ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మాళవిక.. తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నన్ను మట్టు వరలక్ష్మీలో యాక్ట్ చేసిన ఆమె బీయాండ్ ద క్లౌడ్స్ అనే హిందీ చిత్రంలో నటించింది. తర్వాత ద గ్రేట్ ఫాదర్ మూవీలో యాక్ట్ చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, ధనుష్ మూవీస్ పేట, మాస్టర్, మారన్‌లో కనిపించింది. క్రిస్టి అనే మలయాళ మూవీ చేసింది. 2013 నుండి కెరీర్ స్టార్ట్ కాగా, ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఈ పదేళ్ల కాలంలో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. కానీ బిగ్ ప్రాజెక్టుల్లోనే కనిపించింది. ఇప్పుడు కూడా ఆమె చేతిలో బడా బడ్జెట్ చిత్రాలే ఉన్నాయి. ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ మూవీతో టాలీవుడ్ ఇంట అడుగుపెడుతోంది అమ్మడు. అంతేకాకుండా తంగలాన్, యోధ్రా వంటి హిందీ చిత్రాలు మాళవిక చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş