iDreamPost
android-app
ios-app

‘తంగాలన్‌’ రచ్చ మామూలుగా లేదు.. గూస్‌బమ్స్‌ ఖాయం!

కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జీవీ ప్రకాశ్‌ను తీసుకున్నారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న తర్వాత సినిమా ఓ కొలుక్కి వచ్చింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జీవీ ప్రకాశ్‌ను తీసుకున్నారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న తర్వాత సినిమా ఓ కొలుక్కి వచ్చింది.

‘తంగాలన్‌’ రచ్చ మామూలుగా లేదు.. గూస్‌బమ్స్‌ ఖాయం!

‘తంగాలన్‌’.. గత కొన్నేళ్లుగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు 2021 నుంచి ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో సందిగ్ధత నెలకొంది. షూటింగ్‌ ప్రారంభమై మధ్యలో ఆగిపోయింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమానుంచి ఆమె తప్పుకున్నారు. ఆమె స్థానంలో మాళవిక మోహన్‌ను ఎంపిక చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొదట ఈ సినిమా కోసం ‘అనిరుధ్‌’ను ఎంపిక చేశారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జీవీ ప్రకాశ్‌ను తీసుకున్నారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న తర్వాత సినిమా ఓ కొలుక్కి వచ్చింది. సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ఇప్పటికే ఫిక్స్‌ అయింది. ఈ సినిమా 2024, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ‘తంగాలన్‌’ టీజర్‌ రిలీజైంది. 1.32 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్‌ అద్భుతంగా ఉంది. చియాన్‌ నటనకు, టీజర్‌ లోని సీన్లకు గూస్‌బమ్స్‌ మాత్రం పక్కా. మరి, ఈ టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి