Thalapathy Vijay: దళపతి విజయ్ గొప్ప మనసు.. ఆ విద్యార్థులకు భారీ సాయం!

మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు దళపతి విజయ్. ఆ విద్యార్థులకు భారీ సాయంతో పాటుగా సన్మానం చేయనున్నట్లు టీవీకే పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు దళపతి విజయ్. ఆ విద్యార్థులకు భారీ సాయంతో పాటుగా సన్మానం చేయనున్నట్లు టీవీకే పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయ్ కు తమిళనాడుతో పాటుగా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశాడు. ‘తమిళగ వెట్రి కజగం’ పేరుతో పొటికల్ పార్టీని కూడా స్థాపించాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తున్నాడు. అందులో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆ విద్యార్థులకు భారీ సాయంతో పాటుగా సన్మానం చేయనున్నట్లు టీవీకే పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దళపతి విజయ్ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. గతంలో తమిళనాడులో వచ్చిన వరదల కారణంగా ఎంతో మంది నష్టపోయారు. ఆ సమయంలో వరద బాధితుల కోసం భారీగా విరాళం ఇచ్చాడు. ఇక గత ఏడాది 12వ తరగతి పరీక్షల్లో 600/600 మార్కులు సాధించిన నందిని అనే స్టూడెంట్ కు డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తమ ఫలితాలు సాధించిన మరో రెండు వేల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేశాడు విజయ్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుంటూ.. ఈ ఏడాది 10, 12 తరగతుల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు రివార్డుతో పాటుగా సన్మానం చేయనున్నట్లు ప్రకటించారు.

మరోసారి విద్యార్థులకు సాయం అందించేందుకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సిద్దమైయ్యాడు. ఈ ఏడాది 10, 12 తరగతుల్లో టాపర్ గా(మెుదటి మూడు స్థానాల్లో) నిలిచిన విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటుగా సన్మానం చేయనున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీవీకే పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి విజయ్ తన గొప్ప మనసు చాటుకుంటూ విద్యార్థులకు సాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments