iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి వెండితెరపై కన్నా బుల్లితెరలోనే అదరగొడుతోంది

  • Published Aug 26, 2024 | 1:19 PM Updated Updated Aug 26, 2024 | 1:19 PM

ఈ ఫోటోలోని చిన్నారి వెండితెరపై కన్నా బుల్లితెరలోనే అదరగొడుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. అక్కడ బుల్లితెర రోజాగా గుర్తింపు పొందింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలోని చిన్నారి వెండితెరపై కన్నా బుల్లితెరలోనే అదరగొడుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. అక్కడ బుల్లితెర రోజాగా గుర్తింపు పొందింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Aug 26, 2024 | 1:19 PMUpdated Aug 26, 2024 | 1:19 PM
ఈ చిన్నారి వెండితెరపై కన్నా బుల్లితెరలోనే అదరగొడుతోంది

తెలుగు నటీమణులకు తెలుగులో సరైన ఛాన్సులు రావు అన్న అపవాదు గత కొంత కాలంగా నడుస్తుంది. ఇప్పుడు అది స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీకి చేరింది. బుల్లితెరపై కూడా కన్నడ భామల హవా కొనసాగుతుంది. దీంతో మన టీవీ యాక్టర్స్ మరో ఇండస్ట్రీ వైపు చూడాల్సిన పరిస్థితి. ఇదిగో ఈ ఫోటోలోని పాప కూడా నటిగా మారి, తెలుగు చిత్రాలు, బుల్లితెరపై మెరిసింది. అయితే ముందు చూపుతో పరాయి పరిశ్రమకు వెళ్లి సత్తా చాటుతోంది. ఇంతకు ఆమె ఎవరంటే.. తెలుగమ్మాయి ప్రియాంక నల్కారి. తెలుగు కన్నా తమిళంలో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తెలుగులో అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది. జబర్దస్త్‌లోనూ నవ్వించింది. అందరి బంధువయ్యా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తర్వాత సుధీర్ బాబు శివ మనసులో శృతిలో హీరో చెల్లెలిగా కనిపిస్తుంది.

సంథింగ్, సంథింగ్, నా సామి రంగా చిత్రాల తర్వాత బుల్లితెర, ఇటు వెండితెరపైన మెరిసింది. ఆహ్వానం, మేఘమాల, మంగమ్మగారి మనవరాలు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇవి చేస్తూనే టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించింది. రవితేజ కిక్ 2లో నటించింది. కానీ ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో అక్కడ బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. 2018లో ప్రసారమైన రోజాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించాక.. ఒక్కసారిగా ఆమెకు స్టార్ డమ్ స్టార్టయ్యింది. అలా బుల్లితెర రోజాగా మారిపోయింది. తమిళంలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆమెకు. అలా సీరియల్స్ చేస్తూనే తనకు వచ్చిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. హైపర్, నేనే రాజు నేనే మంత్రి, కాంచన 3లో మెరిసింది ఈ బుల్లితెర బ్యూటీ. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఫేమ్ రావడంతో అక్కడే కంటిన్యూ అయ్యింది.

Priyanka Nalkari, Serial Actress, Roja 1

సీతారామం, నల దమయంతి సీరియల్స్ చేసింది. 2023లో ప్రారంభమైన నలదమయంతి సీరియల్.. ఈ ఏడాది మేలో తెరపడింది. ఇందులో దమయంతి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె నటించిన రెండు సీరియల్స్ మేలో ఎండ్ కార్డు పడ్డాయి. అయితే గత ఏడాది ప్రియాంక నల్కారి .. తన ప్రియుడు రాహుల్ వర్మను చడీ చపుడు లేకుండా మలేషియాలోని ఓ దేవాలంయలో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెళ్లి తర్వాత సీతారామన్ సీరియల్ నుండి తప్పుకుంది. అలాగే ఈ ఇద్దరు కూడా ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. కానీ పెళ్లై ఏడాది తిరగకుండా భర్తతో విడిపోతున్నట్లు వెల్లడించడంతో పాటు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet