iDreamPost
android-app
ios-app

భర్తలను వదిలేసి ఎఫైర్స్! మొన్న సౌందర్య.. కొత్తగా జగతి?

  • Author ajaykrishna Published - 08:30 AM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 08:30 AM, Mon - 24 July 23
భర్తలను వదిలేసి ఎఫైర్స్! మొన్న సౌందర్య.. కొత్తగా జగతి?

ఇండస్ట్రీలో లవ్, మ్యారేజ్ లాంటి విషయాలకు పూర్తిగా విలువ లేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎంతకాలం కొనసాగుతాయో ఎవరు చెప్పలేరు. కానీ.. కొద్దికాలంలోనే వారి బంధాలు ముగుస్తాయి అని మాత్రం జనాల్లో నమ్మకం బాగా పెంచేసారు. సినీ నటులే కాదు.. సీరియల్ ఆర్టిస్ట్ లు సైతం ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో సినీతారలనే ఫాలో అవుతున్నారు. బంధాలను కాపాడుకుందాం అనే ఆలోచన లేకుండా విడిపోయి బతకడంపై సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నటీమణులు భర్తలను వదిలేసి వేరే వాళ్ళతో ఎఫైర్ నడుపుతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఇద్దరు కన్నడ నటులే అయినప్పటికీ.. తెలుగులో వీళ్ళకి సూపర్ క్రేజ్ ఉంది. సీరియల్ ఆర్టిస్తులుగా చాలా ఫేమస్. ముందుగా కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తల్లి గుర్తుండే ఉంటుంది. సౌందర్య అనే ఆ పాత్రలో అర్చన అనంత్ నటించింది. ఈ సీరియల్ తో అర్చనకు తెలుగులో మంచి పేరుతో పాటు ఫేమ్ కూడా వచ్చింది. ప్రెజెంట్ ఈమె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్ లో నటిస్తోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. అర్చన గత కొన్నాళ్లుగా తన భర్తను వదిలి వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తుందని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. అతను కూడా ఇండస్ట్రీకి చెందినవారే అని, పైగా వయస్సు పైబడిన వాడని తెలుస్తోంది. ఇక అర్చన బాటలోనే నటి జ్యోతి రాయ్ కూడా వెళ్తోంది అని వార్తలు జోరుగా నడుస్తున్నాయి.

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి తల్లి జగతి క్యారెక్టర్ లో నటిస్తోంది జ్యోతి రాయ్. ఒకప్పుడు కన్నడలో హీరోయిన్ గా సినిమాలు చేసిన ఆమె.. ఇప్పుడు సీరియల్స్ తో బిజీ అయిపోయింది. సీరియల్ లో జగతిగా పాపులర్ అయిన జ్యోతి.. భర్తను వదిలేసి సుకు పూర్వాజ్ అనే డైరెక్టర్ తో ఎఫైర్ నడుపుతుందట. సుకు పూర్వాజ్.. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి సినిమాలు తెరకెక్కించారు. జ్యోతి, సుకు ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారని టాక్. వీరిద్దరూ కలిసి ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేసుకుంటూ తెగ లవర్ సింబల్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. జ్యోతికి 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఓ బాబు. తర్వాత ఆయనతో విడిపోయి డైరెక్టర్ తో కలిసిందని టాక్. అయితే.. అటు అర్చన, ఇటు జ్యోతి ఎప్పుడూ తమ పర్సనల్ లైఫ్ రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడలేదు. సో.. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి వీరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş