Swetha
ఇంకొద్ది గంటల్లో సినిమా ప్రీమియర్స్ ఉన్నాయ్ అనగా ఓజి మూవీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హై కోర్టు ఓజి సినిమా మీద బాంబు వేసింది. ముందే ఓజి సినిమా టికెట్స్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఇంకొద్ది గంటల్లో సినిమా ప్రీమియర్స్ ఉన్నాయ్ అనగా ఓజి మూవీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హై కోర్టు ఓజి సినిమా మీద బాంబు వేసింది. ముందే ఓజి సినిమా టికెట్స్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి.
Swetha
ఇంకొద్ది గంటల్లో సినిమా ప్రీమియర్స్ ఉన్నాయ్ అనగా ఓజి మూవీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హై కోర్టు ఓజి సినిమా మీద బాంబు వేసింది. ముందే ఓజి సినిమా టికెట్స్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎంత రేట్లు పెంచినా టికెట్స్ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి వేసిన పిల్ ను కన్సిడర్ చేసి.. ఓజికి టికెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులు చెల్లవని, ఇది ప్రీమియర్లకు కూడా వర్తిస్తుందని.. నెక్స్ట్ హియరింగ్ ని అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
ఇప్పుడు ఈ న్యూస్ ఓజి డిస్ట్రిబ్యూటర్లకు హై టెన్షన్ ను ఇస్తుంది. దాదాపు అన్ని షోస్ టికెట్స్ కూడా అమ్ముడయి పోయాయి. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ రావడం వారిని కాస్త కంగారు పెడుతుంది. ఒకవేళ కోర్ట్ ఉత్తర్వులను జారీ చేస్తే.. ఈరోజుతో సహా రేపటినుంచి పెట్టిన టికెట్స్ రేట్స్ అన్ని సరిచేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్న గరిష్ట అనుమతి మల్టీప్లెక్సుకు 295 రూపాయలు , సింగల్ స్క్రీన్ కు 75 రూపాయలు పెట్టాలి.
ఇదే కనుక జరిగితే డిస్ట్రిబ్యూటర్లకు కాస్త నష్టం వాటిల్లక తప్పదు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి రిఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. లాస్ట్ మినిట్ లో ఇదంతా కాస్త గందరగోళాన్ని సృష్టించిన మాట వాస్తవం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చూస్తున్నారట నిర్మాతలు. సో రాబోయే గంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.