iDreamPost
android-app
ios-app

Teja Sajja: నేను సూపర్‌ స్టార్‌ మహేష్‌కు పోటీ ఏంటి?: తేజ సజ్జా

  • Published Jan 02, 2024 | 12:26 PM Updated Updated Jan 02, 2024 | 12:26 PM

తేజ బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో ఆయన కలిసి పని చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు కుమారుడిగా కూడా నటించారు.

తేజ బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో ఆయన కలిసి పని చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు కుమారుడిగా కూడా నటించారు.

  • Published Jan 02, 2024 | 12:26 PMUpdated Jan 02, 2024 | 12:26 PM
Teja Sajja: నేను సూపర్‌ స్టార్‌ మహేష్‌కు పోటీ ఏంటి?: తేజ సజ్జా

ఈ సంక్రాంతికి నాలుగైదు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో స్టార్‌ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ గుంటూరు కారం’ జనవరి 12 విడుదల కానుంది. వెంకటేష్‌ సినిమా ‘సైంధవ్‌’ మరుసటి రోజు..అంటే జనవరి 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఈగల్‌’ సినిమా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ హనుమాన్‌’ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.

హనుమాన్‌ జనవరి 12న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. తేజ సజ్జ హీరోగా నటించారు. అయితే, గత కొంత కాలం నుంచి హనుమాన్‌ సంక్రాంతి బరిలో నిలవటంపై వివాదం నడుస్తోంది. స్టార్లకు పోటీగా వస్తున్నందుకు కొంతమంది హనుమాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమచారం. సినిమా విడుదలను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని దర్శకుడు చెప్పాడు.

‘‘ మా సినిమా వాళ్ల సినిమాకు పోటీగా వస్తున్నందుకు కొంతమందికి కోపంగా ఉంది. నేను దాన్ని ఫేస్‌ చేస్తున్నాను. నేను చాలా ఫీల్‌ అయ్యాను. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ నన్ను బూతులు తిడుతున్నారు. నేను వాళ్లను మార్చలేను కాబట్టి.. నేను మెచ్యూర్‌ అయ్యాను. నేను దాన్ని పాజిటివ్‌ వేలో తీసుకుంటున్నాను. సినిమాను నెగిటివ్‌ చేసే అవకాశం ఉంది. సెన్సార్‌ విషయంలో అడ్డంకులు వస్తే.. ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉపయోగించి సాల్వ్‌ చేశాం. అది ఎవరు క్రియేట్‌ చేశారో తెలీదు. ఎవరు ఆపాలని చూస్తున్నారో తెలీదు. కొంతమంది అడ్డంకులు కలిగిస్తున్నారు. నా దృష్టికి వచ్చింది’’ అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే తేజ సజ్జా.. సూపర్‌ స్టార్‌ మహేష్‌కు పోటీ వెళుతున్నాడని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై తేజ సజ్జా తాజాగా స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ సూపర్‌ స్టార్‌తో పోటీ ఏంటి సార్‌.. ఆయనతో పోటీగా కాదు సార్‌.. ఆయనతో పాటుగా ’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, తేజ సజ్జా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

మహేష్‌ బాబుతో కూడా కలిసి నటించారు. మహేష్‌ కొడుకు పాత్రలు చేశారు. రాజ కుమారుడు, యువరాజు సినిమాల్లో నటించారు. జాంబి రెడ్డి చిత్రంతో హీరోగా మారారు. మరి, సూపర్‌ స్టార్‌కు తాను పోటీ కాదంటూ తేజ సజ్జ ఇచ్చిన స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss