iDreamPost
android-app
ios-app

పాము కాటునుంచి నన్ను ఆయనే కాపాడాడు : తేజ సజ్జ

  • Published Jan 04, 2024 | 4:46 PM Updated Updated Jan 04, 2024 | 5:44 PM

Teja Sajja: హనుమాన్‌ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Teja Sajja: హనుమాన్‌ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

  • Published Jan 04, 2024 | 4:46 PMUpdated Jan 04, 2024 | 5:44 PM
పాము కాటునుంచి నన్ను ఆయనే కాపాడాడు : తేజ సజ్జ

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌ హవా నడుస్తోంది. సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా సినిమా విడుదల కోసం చూస్తున్నాడు. హనుమాన్‌ మూవీ ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది. జనవరి 12వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు తేజ సజ్జ .. హనుమంతుడి లీలల గురించి మాట్లాడారు. హనుమంతుడి కారణంగానే తాను పాము కాటునుంచి తప్పించుకున్నానని అన్నారు. హనుమంతుడు చాలా లీలలు చేశాడని చెప్పారు. తేజ సజ్జ మాట్లాడుతూ.. ‘‘ నాక్కానీ, నా డైరెక్టర్‌కు కానీ, సినిమా బాగా తీద్దాం అని తప్ప ఏమీ లేదు. రెండు సినిమాలు ఎక్కించేద్దాం.. మూడు సినిమాలు ఎక్కించేద్దాం అని ఏమీ లేదు. ప్యూర్‌ ఇంటెన్షన్‌తో బయలు దేరి సినిమా చేసుకుంటూ వెళ్లాం.

సగం మాత్రమే మేము చేశాం. మేము ఎఫర్ట్‌ పెట్టాం. కాదనను.. కానీ, మమ్మల్ని వెనకాలినుంచి ఎవరూ నడిపిస్తున్నట్లు ఉంటది. సడెన్‌గా జరిగే పని ఒకటి ఆగుద్ది. అప్పుడు మేము ఢీలా పడిపోయేవాళ్లం. నాలుగు రోజుల తర్వాత వచ్చి చూస్తే.. ఆ రోజు ఆ పని జరిగి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలిసేది. ఇలాంటివి నాలుగైదు ఇన్‌సిడెంట్లు ఉన్నాయి. చాలా యాక్సిడెంట్లు మిస్‌ అయ్యాయి షూటింగ్‌లో.. ఓ రోజు కట్లపాము నా తల దగ్గర ఉంది. అడవిలో షూటింగ్‌.. అప్పటికే ఐదు టేకులు ఆరు టేకులు చేశా.

ఓ సిబ్బంది నా వెనకాల పాము ఉందని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరకు ‘ మీ వెనకాల.. ’అని అనంగానే.. నేను ముందుకు దూకా.. ఎందుకు గట్టిగా చెప్పలేదు అని అడిగా.. ‘ మీరు సడెన్‌గా తిరిగితే కాటు వేస్తుందని చెప్పలేదు’ అన్నాడు. నేను అది నా తల దగ్గర ఉందని తెలియక .. దాని ముందు చాలా రచ్చ రచ్చ చేశా. నాకు మాత్రం ఏమీ అవ్వలేదు. ఇది చాలా చిన్న ఇన్‌సిడెంట్‌. పెద్దవి చాలా జరిగాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఇక, హనుమాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జనవరి 7వ తేదీన జరగనుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. చిరు హనుమాన్‌ సినిమాలో హనుమంతుడిగా కనిపించనున్నాడని టాక్‌. మరి, హనుమాన్‌ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio