iDreamPost
android-app
ios-app

తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్‌ పోస్టు..

  • Published Oct 27, 2023 | 10:27 AM Updated Updated Oct 27, 2023 | 10:28 AM

నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వెప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు..

నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వెప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు..

  • Published Oct 27, 2023 | 10:27 AMUpdated Oct 27, 2023 | 10:28 AM
తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్‌ పోస్టు..

ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న చనిపోయి దాదాపు ఆరు నెలలు పైనే అవుతోంది. ఆయన భార్య అలేఖ్య మాత్రం ఆ బాధలోంచి కొంచెం కూడా బయటపడినట్లు కనిపించటం లేదు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె భర్త గురించి తరచుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ పోస్టులు చదివిన వారిని కంటతడి పెట్టించేలా ఉన్నాయి. తాజాగా, కూడా ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. తమ పిల్లల కోసం తాను స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

తనకు సంబంధించినంత వరకు తారకరత్నే తన బలమన్నారు. ‘నువ్వు నాకు కావాలి నాన్నా.. నేను బాధపడుతున్నా.. ఒంటరిగా ఉన్నా.. ఓటమిలో ఉన్నా.. పైకి లేపేందుకు నువ్వు కావాలి.. నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వెప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు.. నీ కోసం నా గుండెల్లోంచి రక్తం కారుతోంది బంగారు.. ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేవని బాధగా ఉంది’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

కాగా, నారా లోకేష్‌ జనవరి నెలలో చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె పోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం కన్నుమూశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోవటంతో అలేఖ్య ఎంతో కృంగిపోయారు. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరి, దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య భర్త గురించి పెట్టిన ఎమోషనల్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio