iDreamPost
android-app
ios-app

పుష్ప 2 ట్రైలర్ లో అరగుండు వ్యక్తి ఎవరు .. కట్టప్ప అతనేనా!

  • Published Nov 19, 2024 | 3:14 PM Updated Updated Nov 19, 2024 | 3:14 PM

Pushpa 2 Movie Updates: పుష్ప 2 ట్రైలర్ లో సస్పెన్స్ లు , యాక్షన్ సీన్స్ తారా స్థాయిలో ఉండడమే కాకుండా కొత్త క్యారెక్టర్స్ పరిచయం అందరికి ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీనితో అభిమానులు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ను డీకోడ్ చేస్తున్నారు. అయితే వాటి అన్నిటిలో అరగుండుతో ఉన్న వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

Pushpa 2 Movie Updates: పుష్ప 2 ట్రైలర్ లో సస్పెన్స్ లు , యాక్షన్ సీన్స్ తారా స్థాయిలో ఉండడమే కాకుండా కొత్త క్యారెక్టర్స్ పరిచయం అందరికి ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీనితో అభిమానులు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ను డీకోడ్ చేస్తున్నారు. అయితే వాటి అన్నిటిలో అరగుండుతో ఉన్న వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

  • Published Nov 19, 2024 | 3:14 PMUpdated Nov 19, 2024 | 3:14 PM
పుష్ప 2 ట్రైలర్ లో అరగుండు వ్యక్తి ఎవరు .. కట్టప్ప అతనేనా!

పుష్ప నామ్ చోటా హాయ్.. లేకిన్ సౌండ్ బహుత్ బడా , పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్ , పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైరు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఇదే డైలాగులు మోత మోగిపోతున్నాయి. ఇప్పటివరకు సినిమా గురించి ఏ రేంజ్ లో టాక్ వినిపించిందో.. ట్రైలర్ కట్ అంతకుమించి అభిమానులను మెప్పించింది. నిమిషాల్లో సోషల్ మీడియా అంతా పుష్ప మయం అయింది. ట్రైలర్ లో సస్పెన్స్ లు , యాక్షన్ సీన్స్ తారా స్థాయిలో ఉండడమే కాకుండా కొత్త క్యారెక్టర్స్ పరిచయం అందరికి ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీనితో అభిమానులు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ను డీకోడ్ చేస్తున్నారు. అయితే వాటి అన్నిటిలో అరగుండుతో ఉన్న వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అర గుండు, చెవులకు కమ్మలు , ముక్కెర , మెడలో చెప్పుల దండ వేసుకుని వింతగా నవ్వుతున్న వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఆ వ్యక్తి మరెవరో కాదు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప. దేవర సినిమాలో భైర కొడుకు క్యారెక్టర్ చేసింది కూడా ఇతనే. ఇక ఇప్పుడు పుష్ప 2 తో ఓ డిఫరెంట్ రోల్ లో మరోసారి తెరపై కనిపించబోతున్నాడు. రీసెంట్ గా తారక్ పొన్నప్ప ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 లో తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ రోల్ పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా అని అడిగితే.. చాలా పాజిటివ్ అలాగే నెగెటివ్ గా కూడా ఉంటుందని చెప్పాడు. దీనితో ఇదేదో బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ లా ఉండబోతుందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను చూస్తే.. తారక్ చెప్పినదానికి సరిగ్గా సరిపోతుందని.. పుష్ప రాజ్ కు వెన్ను పోటు పొడిచే క్యారెక్టర్ ఇదే అయ్యి ఉంటుందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. దీనికంటే ముందు శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ఇలాంటిదే అనే టాక్ నడిచింది. మరో వైపు సినిమాలో పుష్ప రాజ్ చనిపోతాడా అంటూ ఊహాగానాలు , సందేహాలు. మరి ఈ ఇద్దరిలో కట్టప్ప ఎవరు? అసలు అలాంటి క్యారెక్టర్ ఉందా ? ఇలాంటి ప్రశ్నలతో అంతా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆల్రెడీ చూపించిన ట్రైలర్ తో.. ఈ పార్ట్ లో పుష్ప రాజ్ అనేక మంది శత్రువులను ఎదుర్కుంటాడనే క్లారిటీ వచ్చేసింది. మొదటి పార్ట్ లో ఉన్న విలన్స్ సునీల్ , అనసూయ భరద్వాజ్ , ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో కూడా విలన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. అయితే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు.. పుష్ప రాజ్ మీద పగతో ఈ ముగ్గురు ఒక్కటౌతారని ఓ షాట్ ను బట్టి అర్ధమౌతుంది. వీరితో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లోను పుష్ప రాజ్ కు శత్రువులు పెరిగిపోయారని అర్థమౌతుంది. మొత్తానికి ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామా , ఫైట్ లు, సస్పెన్స్ లు , ఎలివేషన్స్ తో బొమ్మ అదిరిపోయేలా కనిపించబోతుంది . డిసెంబర్ 5 న షో పడితే కానీ అసలు కథేంటో అర్థంకాదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap