iDreamPost
android-app
ios-app

ఆడిషన్స్ లో సీన్ ప్రాక్టీస్ పేరుతో.. అలా చేశాడు! యువనటి షాకింగ్ కామెంట్స్!

  • Author ajaykrishna Updated - 08:44 AM, Tue - 1 August 23
  • Author ajaykrishna Updated - 08:44 AM, Tue - 1 August 23
ఆడిషన్స్ లో సీన్ ప్రాక్టీస్ పేరుతో.. అలా చేశాడు! యువనటి షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్న సంగతి తెలిసిందే. పాత తరాల నటీమణుల నుండి నేటి తరం యంగ్ హీరోయిన్స్, సైడ్ ఆర్టిస్ట్ ల వరకు అందరూ ఏదొక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. మీటూ ఉద్యమం ఎప్పుడు మొదలైందో.. అప్పటినుండి హాలీవుడ్ టు టాలీవుడ్ వరకు అందరి లైఫ్ స్ట్రగుల్స్ బయటికి వస్తున్నాయి. అయితే.. పాపులర్ కొరియోగ్రాఫర్ కం యాక్టర్ లారెన్స్ సినిమా ఆడిషన్స్ కి వెళ్తే.. ఆ డైరెక్టర్ తనతో నీచంగా ప్రవర్తించాడని.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి షేర్ చేసుకుంది యువనటి విజే దీపిక. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దీపిక.. ప్రస్తుతం తమిళ బుల్లితెర నటిగా, టీవీ హోస్ట్ గా రాణిస్తోంది.

ఇక రీసెంట్ గా దీపిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి మాట్లాడింది. అదే క్రమంలో తాను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి కూడా నోరు విప్పింది. దీపిక మాట్లాడుతూ.. “హీరో రాఘవ లారెన్స్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అది సిస్టర్ క్యారెక్టర్ కోసం జరుగుతుంది. ఆడిషన్స్ అయ్యాయి.. దాదాపు నన్నే ఆ క్యారెక్టర్ కి ఫైనల్ చేశారు. కానీ.. అక్కడున్న డైరెక్టర్ చేసిన పనికి చాలా బాధేసింది. ఇండైరెక్ట్ గా మాట్లాడి డైరెక్టర్ నన్ను లోబరచుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమాలో ఓ ముద్దు సీన్ ఉంది. దానికి రిహార్సల్ లాగా అక్కడే ఓ సీన్ చేసి చూపించాలని ఇబ్బందికరంగా మాట్లాడాడు.

అతను అలా అనేసరికి నేను షాక్ లో నేను నో అన్నట్లుగా తల ఊపాను. అంతటితో ఆ డైరెక్టర్ ఆగకుండా నువ్వు ముద్దు సీన్ చేస్తేనే క్యారెక్టర్ ఛాన్స్ ఇస్తాను లేకుంటే లేదని మొహం మీదే చెప్పేశాడు. నాకు అక్కడే ఏం అనాలో తెలియలేదు. వెంటనే అలాంటివి నాతో కాదని వెనక్కి వచ్చేశాను. ఆ డైరెక్టర్ నన్ను మాటలతో బెదిరించి.. మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. నేను ఆ ముద్దు సీన్ కి ఒప్పుకొని ఉంటే.. నన్ను లైంగికంగా వశపరచుకునే ప్లాన్ వేశాడని నేను పసిగట్టాను. అవకాశం ఇవ్వడానికి డైరెక్టర్ చూపించిన నీచబుద్ది.. నాకు బాధ కలిగించింది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపిక మాటలు సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. మరి కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet