iDreamPost
android-app
ios-app

నేటి యువతకు ఆదర్శం.. ఆ స్టార్ నటుడి కొడుకు ఇప్పుడు IAS ఆఫీసర్

యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలని ఏం లేదని నిరూపించాడు ఆ స్టార్ నటుడి కొడుకు. రంగుల ప్రపంచాన్ని వద్దనుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన సక్సెస్ జర్నీ మీకోసం..

యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలని ఏం లేదని నిరూపించాడు ఆ స్టార్ నటుడి కొడుకు. రంగుల ప్రపంచాన్ని వద్దనుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన సక్సెస్ జర్నీ మీకోసం..

నేటి యువతకు ఆదర్శం.. ఆ స్టార్ నటుడి కొడుకు ఇప్పుడు IAS ఆఫీసర్

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని స్టార్ స్టేటస్ ను సంపాదించడం అనేది చిన్న మాట కాదు. ఈ తరహలోనే కొంతమంది సెలబ్రిటీస్ తాము ఉన్న రంగంలో దశాబ్దలుగా కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు. అలాగే తమ పిల్లలని కూడా అదే రంగంలో కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంటారు. అలా వెండితెర పై స్టార్ కిడ్స్ గా వెలిగిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కాస్తో, కూస్తో సినిమాలు హిట్ అయితే చాలు ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంటారు. అయితే కొంతమంది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు. వారికి నచ్చిన రంగాల్లో ఆసక్తి కనబరుస్తూ తమ టాలెంట్ నిరూపిస్తారు. అయితే చాల వరకు సెలబ్రిటీస్ పిల్లలు సినీ రంగంలోనూ, బిజినెస్ ల్లోనూ కొనసాగుతుంటారు. అయితే తాజాగా ఓ ప్రముఖ తమిళ యాక్టర్ కొడుకు మాత్రం కాస్తా భిన్నంగా ఆలోచించాడు. తన దారే వేరంటూ.. అందరినీ ఆశ్యర్యపరచేలా చేశాడు. ఇంతకి అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

తమిళ యాక్టర్ చిన్ని జయంత్ గురించి అందరికి తెలిసిందే. ఒక కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన అద్భుతమైన నటనతో అటు తమిళ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఆయనకి శృతన్‌జయ నారాయణన్ అనే కొడుకు ఉన్నాడు. సాధారణంగా ఆయన కొడుకంటే వారసత్వంగా ఈ సినీ ఫీల్డ్ లోనే ఏ హీరోగానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో స్థిరపడతాడని అందరూ అనుకుంటారు. అయితే నారాయణన్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైనా మార్గాన్ని ఎంచుకున్నారు.

శృతన్‌జయ టార్గెట్ , ఆలోచనలు ,కష్టపడేతత్వం, సాధించిన విజయమే వేరు. ఒక యాక్టర్ కొడుకుగా పరిచయం అవ్వాల్సిన నారాయణన్ నేడు ‘ఐఏఎస్ నారాయణన్’ గా ప్రపంచానికి పరిచమైయ్యాడు. అయితే చదువుకున్న రోజుల్లో నాటకాలు ప్రదర్శించినప్పటికీ, ఆయన చేరాలనుకున్న గమ్యం వేరు. చదువుల్లో టాపర్ గా ఉండటంతో.. ఆయన తల్లిదండ్రులు అతనికి చదువుల వైపు ప్రోత్సహించారు. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నం నేడు ఇంత విజయవంతం అయ్యింది.

నారాయణన్ చదువుల్లో చాలా చురుకుగా ఉండేవారు. అతను తన డిగ్రీని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ వరకు అశోకా యూనివర్సిటీలో పొందారు. అనంతరం.. ఓ స్టార్టప్ కంపెనీలో భారీ వేతనానికి ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్స్ లో మాత్రమే ఉద్యోగం చేస్తూ.. ఉదయం సమయాల్లో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారు. అలా రాత్రంతా పనిచేసినా.. ఉదయం వేళ కనీసం ఐదు గంటలు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో రోజుకు 10 గంటలు ప్రిపరేషన్ కు కేటాయించి, చివరికి 2015లో విజయం సాధించారు.

ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో 75వ ర్యాంకు సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఇంత సక్సెస్ అవ్వడంలో ఎంత కష్టం ఉందో అందరికి అర్ధం అవుతోంది. కాగా, నారాయణన్ ప్రస్తుతం తమిళనాడులోని త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే తండ్రి బాటలో నడవకుండా.. తన శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్నిపెట్టుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నారాయణన్ ప్రస్తుతం యువతరానికి స్ఫూర్తి. సివిల్ సర్వీసెస్‌లో వృత్తిని కొనసాగించాలనే అతని నిర్ణయం సంకల్పానికి, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. మరి, ఒక యాక్టర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతని జర్నీని గురించి మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.