iDreamPost
android-app
ios-app

యానిమల్ ను పొగిడినందుకు శివ కార్తికేయన్ పై తమిళ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్

  • Published Mar 06, 2024 | 7:13 PM Updated Updated Mar 06, 2024 | 7:13 PM

సందీప్ సినిమాలు మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని చాలా మంది తమిళ ప్రేక్షకులు ఆయన పై ఒక రకమైన ద్వేషాన్ని పెంచేసుకున్నారు.

సందీప్ సినిమాలు మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని చాలా మంది తమిళ ప్రేక్షకులు ఆయన పై ఒక రకమైన ద్వేషాన్ని పెంచేసుకున్నారు.

  • Published Mar 06, 2024 | 7:13 PMUpdated Mar 06, 2024 | 7:13 PM
యానిమల్ ను పొగిడినందుకు శివ కార్తికేయన్ పై తమిళ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్

ప్రస్తుతం మొత్తం తమిళ సినీ ప్రేక్షకులు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్న ఒకే ఒక్క అంశం ఏదైనా ఉందంటే అది సందీప్ రెడ్డి వంగా పై వారికున్న అనవసరమైన ద్వేషం అనే చెప్పాలి. సందీప్ సినిమాలు మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని చాలా మంది తమిళ ప్రేక్షకులు ఆయన పై ఒక రకమైన ద్వేషాన్ని పెంచేసుకున్నారు. అంతటితో ఆగకుండా సందీప్ వంగాను లేదా ఆయన తీసిన యానిమల్ సినిమాని ఎవరైనా మెచ్చుకుంటే కూడా ఓర్వలేక వాళ్ళని కూడా అసహ్యించుకుంటున్నారు తమిళ సినీ అబిమానులు.

తమిళ యువ హీరో శివ కార్తికేయన్ ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాని మెచ్చుకున్నారు. సందీప్ తన సినిమాల్లో సంగీతాన్ని ఉపయోగించే విధానం తనకు చాలా ఇష్టమని, అంతే కాకుండా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. అయితే సందీప్ వంగాని పొగిడిన శివ కార్తికేయన్ పై సోషల్ మీడియాలో తమిళ నెటిజన్లు నెగిటివ్ ట్రెండ్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు, మహిళలను హింసించే సన్నివేశాలను సినిమాలో పెట్టే దర్శకుడిని ఎలా పొగడగలరని వారు హీరోను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

‘తమిళ ఇండస్ట్రీలో ఉండి తన సినిమాలో మహిళలను దారుణంగా కించపరిచే దర్శకుడిని ఎలా పొగిడారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే స్టార్ హీరోయిన్ త్రిష కూడా యానిమల్ సినిమాని ప్రశంసిస్తూ కల్ట్ ఫిల్మ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని పై తమిళ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి త్రిష తన పోస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ శివ కార్తికేయన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎంత హిట్ అయినా ఒక సినిమా లేదా ఆ సినిమా తీసిన దర్శకుడు కొంతమంది ప్రేక్షకులకి నచ్చకపోవడం అనేది సాధారణమైన విషయమే.. అయితే ఆ సినిమా నచ్చిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీల పై కూడా తమిళ ప్రేక్షకులు విరుచుకుపడటం చూసి తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నారు. అసలు చరిత్రలో ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా హీరో హీరోయిన్ తో వయొలెంట్ గా బిహేవ్ చేయనట్టు ఈ ఓవర్ యాక్షన్ ఏమిటని హిందీ ప్రేక్షకులు, యానిమల్ సినిమాను సపోర్ట్ చేసే వాళ్ళు
కూడా అంటున్నారు.

యానిమల్ – తమిళ ప్రేక్షకుల హల్చల్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet