iDreamPost
android-app
ios-app

లస్ట్ స్టోరీస్ 2.. నా లవర్ తోనే రోమాంటిక్ సీన్లు చేశా తప్పేముంది! తమన్నా హాట్ కామెంట్స్..

  • Author Soma Sekhar Updated - 11:14 AM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Updated - 11:14 AM, Mon - 26 June 23
లస్ట్ స్టోరీస్ 2.. నా లవర్ తోనే రోమాంటిక్ సీన్లు చేశా తప్పేముంది! తమన్నా హాట్ కామెంట్స్..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పేరు రావాలంటే నటనతో పాటుగా అందాల ఆరబోత కూడా ఉండాలి. అయితే ఇది అందరి హీరోయిన్లకు వర్తించదు. కొంత మంది భామలు తమ అందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతుంటే.. ఇంకొంత మంది బ్యూటీలు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో రోజులు మారుతున్న కొద్ది హీరోయిన్ల అభిప్రాయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు నటించని పాత్రల్లో, బోల్డ్ సీన్స్ లో నటించేందుకు వెనకాడటం లేదు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన 18 సంవత్సరాల లిప్ కిస్ బ్రహ్మ చర్యానికి ముగింపు పలికింది.

తమన్నా.. మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ తో పాటుగా ఇతర బాషల్లో మంచి గుర్తింపు పొందింది. తన అందంతో, నటనతో, డ్యాన్స్ తో తనకంటూ అభిమానుల్లో ఓ క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది. అదీకాక బాలీవుడ్ అడల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో నటిస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో తమన్నా రెచ్చిపోయింది. తన ప్రియుడు విజయ్ వర్మతో శృంగార సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సిరీస్ కోసం తన 18 సంవత్సరాల లిప్ కిస్ బ్రహ్మచర్యానికి ముగింపు పలికింది.

ఈ సిరీస్ లో తన లవర్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. దాంతో ఈ అమ్మడుపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై తాజాగా స్పందించారు తమన్నా.లస్ట్ స్టోరీస్ లో రొమాంటిక్ సీన్లలో నటించడంపై ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఆడియన్స్ ఇలాంటి స్టోరీసే చూస్తున్నారని, అందుకు తగ్గట్లుగానే మేం నటిస్తున్నామని తెలిపింది. ఆడియన్స్ లస్ట్ స్టోరీస్ 1 చూసి ఎంజాయ్ చేశారని ఈ సందర్భంగా తమన్నా చెప్పుకొచ్చారు. ఇక లస్ట్ స్టోరీస్ 2లో నేను చేసిన రొమాంటిక్ సీన్ల గురించి సిగ్గుపడటం లేదని, ఎందుకంటే నేను ఆ సీన్లు చేసింది నా ప్రియుడితోనే కాబట్టి.. ఆ సన్నివేశాలను ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సిన్లలో నటించేటప్పుడు విజయ్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని పేర్కొంది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss