iDreamPost
android-app
ios-app

ఆ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నందుకు ఇంకా బాధగానే ఉంది: తమన్నా

  • Author ajaykrishna Published - 10:09 AM, Mon - 14 August 23
  • Author ajaykrishna Published - 10:09 AM, Mon - 14 August 23
ఆ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నందుకు ఇంకా బాధగానే ఉంది: తమన్నా

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొన్నిసార్లు అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇంకొన్నిసార్లు చేతిదాకా వచ్చిన స్క్రిప్ట్ ని అంచనా వేయలేక మిస్ చేసుకునే సందర్భాలు కూడా జరుగుతుంటాయి. తీరా మిస్ అయిన సినిమాలు లేదా వదులుకున్న సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ అయితే.. వాటిని మిస్ చేసుకున్న హీరోయిన్స్ బాధ చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అయితే.. దాదాపు పన్నెండేళ్ల క్రితం మిస్ చేసుకున్న ఓ బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఇంకా బాధ పడుతున్నానని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. దీంతో తమన్నా మిస్ చేసుకొని బాధపడే రేంజ్ సినిమా ఏంటా అని ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు ఫ్యాన్స్.

తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్ లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు తన పాత్రలకు అనుగుణంగా గ్లామర్ షో చేసిన ఈ భామ.. ఇప్పుడు పెట్టుకున్న సరిహద్దులు అన్ని చెరిపేసి బోల్డ్ క్యారెక్టర్స్ చేసేస్తుంది. తమన్నా నుండి ఎన్నడూ ఎక్స్ పెక్ట్ చేయని.. లిప్ లాక్ సీన్స్.. బెడ్ రూమ్ సన్నివేశాలు రీసెంట్ గా వెబ్ సిరీస్ లలో చేసి చూపించింది. దీంతో ఇకపై ఎలాంటి రోల్స్ చేయడానికైనా తమన్నా రెడీగానే ఉందంటూ కథనాలు మొదలైపోయాయి. మరోవైపు ఆమె నటించిన బిగ్గెస్ట్ మూవీస్ ప్రెజెంట్ థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. సూపర్ స్టార్ రజినీ సరసన నటించిన జైలర్.. మెగాస్టార్ సరసన చేసిన భోళా శంకర్ సినిమాలు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. వీటిలో జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది.

ఇక తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న తమన్నా.. తన కెరీర్ గురించి.. డ్రీమ్ గురించి బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. “సూపర్ స్టార్ రజినీతో నటించడం తన డ్రీమ్ అని.. కనీసం ఆయనతో ఒక ఫోటో అయినా దిగాలని అనుకునేదాన్ని. ఇప్పుడు జైలర్ తో ఆ డ్రీమ్ పూర్తి అయ్యింది. ఇక కెరీర్ లో కొన్ని సినిమాలు వదులుకున్నందుకు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటాను. అలాంటి సినిమాలలో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఒకటి. ఆ సినిమా చూసిన ప్రతిసారి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ముందుగా ఆ స్టోరీ నా దగ్గరికి వచ్చింది. కానీ.. ఆ టైమ్ లో డేట్స్ కుదరక వదులుకున్నాను. తీరా సినిమా చూశాక అనిపించింది.. ఏం చేసైనా డేట్స్ ఇవ్వాల్సింది అని. మిస్టర్ పర్ఫెక్ట్ విషయంలో ఎప్పుడూ బాధగానే ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి తమన్నా మిస్టర్ పర్ఫెక్ట్ చేసుంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet