iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో స్పీడ్ పెంచిన తమన్

  • Published Nov 21, 2024 | 4:02 PM Updated Updated Nov 21, 2024 | 4:02 PM

Game Changer Updates: ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత అటు అభిమానులలో కాస్త నమ్మకం పెరిగింది. శంకర్ ఈ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడనే విషయం అర్థమైంది. ఈసారి ఎలా అయినా శంకర్ సరికొత్త మేకింగ్ తో ఆకట్టుకుంటాడని అంతా నమ్ముతున్నారు. అయితే ఇంకో వైపు తమన్ మాత్రం తన పని తాను పర్ఫెక్ట్ గా కొనసాగిస్తున్నాడు.

Game Changer Updates: ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత అటు అభిమానులలో కాస్త నమ్మకం పెరిగింది. శంకర్ ఈ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడనే విషయం అర్థమైంది. ఈసారి ఎలా అయినా శంకర్ సరికొత్త మేకింగ్ తో ఆకట్టుకుంటాడని అంతా నమ్ముతున్నారు. అయితే ఇంకో వైపు తమన్ మాత్రం తన పని తాను పర్ఫెక్ట్ గా కొనసాగిస్తున్నాడు.

  • Published Nov 21, 2024 | 4:02 PMUpdated Nov 21, 2024 | 4:02 PM
గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో స్పీడ్ పెంచిన తమన్

రామ్ చరణ్- శంకర్ ఓ గేమ్ ఛేంజర్. ఈ సినిమా కోసం ఎదురుచూసి చూసి దాదాపు హోప్స్ వదిలేసుకున్నారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ బిగ్ బడ్జెట్ మూవీ ట్రాక్ లోకి వస్తుంది. మళ్ళీ పాజిటివ్ టాక్ , పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మొన్నటివరకు కూడా ఈ సినిమాకు అసలు హైప్ క్రియేట్ అవుతుందా లేదా అనే అనుమానాలు , సందేహాలు అందరిలో ఉన్నాయి. కానీ ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత అటు అభిమానులలో కాస్త నమ్మకం పెరిగింది. శంకర్ ఈ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడనే విషయం అర్థమైంది. ఈసారి ఎలా అయినా శంకర్ సరికొత్త మేకింగ్ తో ఆకట్టుకుంటాడని అంతా నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఓ మూడు నాలుగు రోజుల పాటు సినిమా గురించి హైప్ బాగానే నడిచింది. కానీ తర్వాత మళ్ళీ కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు.

అయితే ఇంకో వైపు తమన్ మాత్రం తన పని తాను పర్ఫెక్ట్ గా కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే తమన్ రాబోయే సాంగ్ గురించి , అలాగే ఫ్యాన్స్ కోరుకునే అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. పైగా ఫ్యాన్స్ కూడా అప్డేట్స్ కోసం తమన్ నే ఎక్కువగా అడుగుతున్నారు. రీసెంట్ గా తమన్ .. గేమ్ చెంజర్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉందంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. 27 న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్ రాబోతుందని.. అది అందరిని ఓ డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకుని వెళ్తుందని తెలియజేశాడు. పైగా ఈ సాంగ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందంట. అలాగే ఆ సాంగ్ తన మైలేజ్ ను ఇంకా పెంచుతుందనే క్లారిటీ కూడా ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే నెక్స్ట్ వచ్చే సాంగ్ పక్కా అందరి ఫేవరేట్ ప్లే లిస్ట్ లో యాడ్ అవుతుందని అనిపిస్తుంది. మొత్తానికి తమన్ అయితే స్పీడ్ పెంచేశాడు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతోందో చూడాలి.

ప్రస్తుతం పుష్ప మూవీ హడావిడి ఉంది కాబట్టి.. దీని తర్వాత గేమ్ ఛేంజర్ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచే అవకాశం ఉంది. దిల్ రాజు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ ఇది. సో దిల్ రాజు కూడా ఈ మూవీని ప్రేక్షకులలోకి తీసుకువెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. టీజర్ తో అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రమోషన్స్ , ట్రైలర్ , సాంగ్స్ ద్వారా ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అనుకున్నది అనుకునట్లు జరిగితే ఇక చరణ్ సినిమాలకు తిరుగుండదు. శంకర్ కూడా డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి బయటపడతాడు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler