iDreamPost
android-app
ios-app

తమన్ గొప్ప మనస్సు.. ఆ అంధ గాయకుడికి ఛాన్స్

  • Published Nov 14, 2024 | 3:02 PM Updated Updated Nov 14, 2024 | 3:02 PM

SS Taman : టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. మట్టిలో మాణిక్యాలు చాలానే ఉన్నాయని ఎంతో మంది ఇప్పటికే సోషల్ మీడియాలో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అంధ గాయకుడైన రాజు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఈ క్రమంలోనే తాజాగా తమన్ వద్దకు ఓ నెటిజన్ రాజు విషయాన్నీ తీసుకునివెళ్ళాడు. రాజు టాలెంట్ ను తమన్ కు చూపించారు. అలా తమన్ రాజుకి ఒక ప్రామిస్ చేశాడు.

SS Taman : టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. మట్టిలో మాణిక్యాలు చాలానే ఉన్నాయని ఎంతో మంది ఇప్పటికే సోషల్ మీడియాలో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అంధ గాయకుడైన రాజు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఈ క్రమంలోనే తాజాగా తమన్ వద్దకు ఓ నెటిజన్ రాజు విషయాన్నీ తీసుకునివెళ్ళాడు. రాజు టాలెంట్ ను తమన్ కు చూపించారు. అలా తమన్ రాజుకి ఒక ప్రామిస్ చేశాడు.

  • Published Nov 14, 2024 | 3:02 PMUpdated Nov 14, 2024 | 3:02 PM
తమన్ గొప్ప మనస్సు.. ఆ అంధ గాయకుడికి ఛాన్స్

ఒక సంగీత దర్శకుడిగా తమన్ ఎప్పటికప్పుడు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. చాలా మందిలానే తమన్ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలో తానూ ఎదుర్కున్న సవాళ్ళను తాను ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎక్కడినుంచి వచ్చామన్నది మాత్రం మర్చిపోకూడదని అందరూ అంటూ ఉంటారు. ఈ విషయంలో తమన్ ఎప్పటికి ఇలానే ఉంటాడని చాలా సార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం కష్టపడుతున్న వారికి తమన్ సాయం చేస్తూ ఉంటాడని ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరో సారి తమన్ తన గొప్ప మనుసుని చాటుకున్నాడు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. మట్టిలో మాణిక్యాలు చాలానే ఉన్నాయని ఎంతో మంది ఇప్పటికే సోషల్ మీడియాలో నిరూపించుకుంటూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అంధ గాయకుడైన రాజు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ సైతం ఆ గాయకుడి టాలెంట్ కు ఫిదా అయ్యారు. ఒకానొక సమయంలో కీరవాణికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇక ఆ వీడియో తో పాటు.. రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎంతో మంది అతనిని ప్రశంసలతో మెచ్చుకున్నారు. ఇలా అతను సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తమన్ వద్దకు ఓ నెటిజన్ రాజు విషయాన్నీ తీసుకునివెళ్ళాడు. రాజు టాలెంట్ ను తమన్ కు చూపించారు. అలా తమన్ రాజుకి ఒక ప్రామిస్ చేశాడు. అదేంటంటే.. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు ఇండియన్ ఐడిల్ సీజన్ 4లో స్టేజ్ పై పాట పాడించే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పాడు. అంతే కాకుండా రాజు తో కలిసి అతను కూడా స్టేజ్ మీద ఓ సాంగ్ పాడతానని హామీ ఇచ్చాడట తమన్.

తెలుగు ఇండియన్ ఐడిల్ అనేది చిన్న షో అయితే కాదు. అలాంటి స్టేజ్ పై రాజుకు పాట పాడే అవకాశం ఇవ్వడం ద్వారా.. తమన్ ఎంతో గొప్పవాడు అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. తమన్ గురించి అంతా చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తీరాల్సిందే. ఇక ప్రస్తుతం తమన్ రీసెంట్ గా పుష్ప 2 సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఇది కాకుండా ఆల్రెడీ బాలయ్య అఖండ 2 మూవీకి కూడా తమన్ వర్క్ చేస్తున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ మూవీకి సైతం తమన్ సంగీతం అందించడం జరిగింది. ఇలా భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి .ఇవి ఎలా ఉంటాయో చూడాలి. మరి తమన్ తన గొప్ప మనసుని చాటుకున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio