iDreamPost
android-app
ios-app

పుష్ప 2 BGM పై షాకింగ్ అప్డేట్.. DSP కాదా..?

  • Published Nov 07, 2024 | 2:39 PM Updated Updated Nov 07, 2024 | 2:39 PM

Pushpa 2 Updates : పుష్ప 2 మ్యానియా గురించి తెలియనిది కాదు. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పెరుగుతున్న హైప్ అంతా ఇంతా కాదు . అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Pushpa 2 Updates : పుష్ప 2 మ్యానియా గురించి తెలియనిది కాదు. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పెరుగుతున్న హైప్ అంతా ఇంతా కాదు . అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 07, 2024 | 2:39 PMUpdated Nov 07, 2024 | 2:39 PM
పుష్ప 2 BGM పై షాకింగ్ అప్డేట్.. DSP కాదా..?

సరిగ్గా చూస్తే సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు కూడా టైం లేదు. ఓ వైపు అభిమానులంతా సినిమా చూడడం కోసం రెడీ అవుతుంటే. మరో వైపు సుకుమార్ మాత్రం ఇంకా సినిమా తీయడం దగ్గరే ఉన్నాడు. అసలే పుష్ప అనుకున్న టైం కు వస్తుందా లేదా అని ప్రేక్షకులు టెన్షన్ పడుతుంటే.. మధ్యలో వినిపించే అప్డేట్స్ ఇంకాస్త టెన్షన్ పెంచుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా ఐటెం సాంగ్ ఒక్కటి షూట్ చేస్తే సినిమా షూటింగ్ పూర్తయినట్లే అన్నారు. సరే అదొక్కటే కదా సుకుమార్ చెప్పిన టైం కు ఫినిష్ చేస్తాడులే అని రిలాక్స్ అయ్యారు. కానీ ఇంతలోనే మరో న్యూస్ అందరికి షాక్ ఇచ్చింది. ఇది చూసి అసలు పుష్ప 2 షూటింగ్ లో ఏం జరుగుతుందో అర్థంకావట్లేదని కొందరు.. ఎదో ఒకటి చేసి చెప్పిన టైం కు రిలీజ్ చేస్తే చాలని మరికొందరు.. కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ చేయబోతున్నట్లు సమాచారం. తమన్ తో పాటు అజనీష్ లోక్ నాథ్ పేరు కూడా వినిపిస్తుంది. పార్ట్ 1 కు దేవిశ్రీ ప్రసాద్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సో ఈ సినిమాకు కు కూడా అతనే ఉంటాడని అంతా ఫిక్స్ అయ్యారు. పైగా సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ ల బంధం గురించి తెలియనిది కాదు. వారిది తిరుగులేని కాంబినేష‌న్‌. ‘నా ఆత్మ‌.. దేవి’ అంటూ సుకుమార్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. అలాంటిది ఇప్పుడు లాస్ట్ మినిట్ లో సీన్ లోకి తమన్ ఎంటర్ అయ్యేసరికి అందరూ షాక్ అయ్యారు. మరి తమన్ ఎంటర్ అయితే.. దేవి అవుట్ అయినట్టేనా! అసలు లాస్ట్ మినిట్ లో ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? టైం తక్కువ ఉండడమా లేదా మరేదైనానా! ఇలా చాలా ప్రశ్నలు ఆడియన్స్ లో మెదులుతున్నాయి. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది.

అయితే మూవీ టీం నుంచి ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిప్పు లేనిదే పొగ రానట్టు లాస్ట్ మినిట్ లో ఇలాంటి న్యూస్ లు రావు కదా. మరి ఉన్న టైం లో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి వర్క్ చేస్తారా… లేదా తమన్ , అజనీష్ వర్క్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇదొక బ్లాస్టింగ్ సెన్సేషన్ అవ్వబోతుంది. ఏదేమైనా సినిమా అవుట్ పుట్ బావుంటే అదే చాలని చాలా మంది భావిస్తున్నారు. మరో వైపు సుకుమార్ కు దీనిపై స్పదించేంత తీరిక కూడా లేదు. 28 రోజుల్లో రిలీజ్ డేట్, . ఓవర్సీస్ కి డ్రైవ్స్ పంపాలి, సెన్సార్ చేయించాలి, ప్రమోషన్లు చూసుకోవాలి. ట్రైలర్ లాంచ్ డేట్ నవంబర్ 15 లాక్ చేసుకున్నారు. మరి ఇన్ని పనుల్లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వైరల్ అవుతున్న న్యూస్.. బన్నీ ఆర్మీని కాస్త కంగారుపెడుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş