iDreamPost
android-app
ios-app

Taapsee Pannu: హీరోయిన్స్ నైట్ పార్టీస్ కు వెళ్తేనే.. తాప్సి చెప్పిన చేదు నిజాలు!

  • Published Mar 12, 2024 | 7:29 PM Updated Updated Mar 12, 2024 | 7:29 PM

టాలీవుడ్ లో తీసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ 'తాప్సి'. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఈ భామ తాజాగా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీస్ , ఈవెంట్స్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ లో తీసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ 'తాప్సి'. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఈ భామ తాజాగా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీస్ , ఈవెంట్స్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Mar 12, 2024 | 7:29 PMUpdated Mar 12, 2024 | 7:29 PM
Taapsee Pannu: హీరోయిన్స్ నైట్ పార్టీస్ కు వెళ్తేనే.. తాప్సి చెప్పిన చేదు నిజాలు!

టాలీవుడ్ నటి తాప్సి ఇప్పటివరకు సినిమాలలో కనిపించడమే కానీ, ఎప్పుడు కూడా తన పర్సనల్ విషయాలను కానీ, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కానీ.. ఎప్పుడు ఎక్కడ షేర్ చేసుకోలేదు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలమీద మాత్రం ఆమె గట్టిగానే కామెంట్స్ చేస్తుంది. బయట వాటితో కంపేర్ చేసుకుంటే సినీ ఇండస్ట్రీలో ఈవెంట్ లు,పార్టీలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అందులోను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఈవెంట్ లు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ, తాప్సి మాత్రం ఈ ఈవెంట్స్ లో ఎక్కడా కూడా కనిపించదు. బర్త్ డే పార్టీలు, ఈవెంట్ లు, ఫంక్షన్స్ వీటి అన్నిటికి కూడా తాప్సి దూరంగానే ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆరా తీయగా.. తాజాగా తాప్సి దీనిపై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ లో ఝుమ్మంది నాధం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తాప్సి. ఇక ఆ సినిమా తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన తాప్సికి మంచి పేరే వచ్చినా కూడా.. కొంతకాలం తర్వాత టాలీవుడ్ సినిమాలాలో మాత్రం అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. దీనితో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది ఈ భామ. ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాలు తీస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ లో సినిమాలైతే చేస్తుంది కానీ, అక్కడ జరిగే పార్టీస్ కు మాత్రం తాప్సి అటెండ్ అవ్వదు. దానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగగా.. తాప్సి మాట్లాడుతూ.. “పెద్ద స్టార్స్‌కి మెసేజ్‌లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితే వారు నన్ను బర్త్ డే పార్టీస్ కు ఆహ్వానిస్తారు. నేను అలా చేయలేదు. నేను పొద్దున్నే నిద్ర లేస్తాను కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను సిగరెట్ తాగాను. కాబట్టి పార్టీల్లో ఏం చేయాలో నాకు తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి.

Taapsee

అంతేకాకుండా.. “నాకు అంతగా పరిచయం లేని వ్యక్తులతో నేను పార్టీలు చేసుకోలేను. నేను వారితో ఏమి మాట్లాడాలి ? పార్టీ పెట్టకపోతే ఏ పనీ రాదని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్‌లో ఈజీగా ముందుకెళ్లొచ్చు. అయితే, 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కష్టపడి పనిచేస్తాను. ఇప్పటివరకు అంతే కష్టపడి ముందుకు వచ్చాను.” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి. ఇక తాప్సి బాలీవుడ్ లోనే వరుస సినిమాలతో బిజీగా ఉంది. పైగా, గత కొంతకాలంగా ఓ వ్యక్తితో తాప్సి డేటింగ్ లో ఉందని.. త్వరలో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు. మరి, తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో జరిగే ఈవెంట్స్ పై తాప్సి చేసిన వ్యాఖ్యలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet