iDreamPost
android-app
ios-app

అతడితో 10 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నా..: తాప్సీ పన్ను

  • Published Jan 19, 2024 | 12:45 PM Updated Updated Jan 19, 2024 | 12:45 PM

తెలుగు ఇండస్ట్రీలో నటనలో ఓనమాలు దిద్ది.. బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా చెలామణి అవుతోంది తాప్సీ పన్ను. ఇటీవల షారూక్, రాజ్ కుమార్ హీరానీ కాంబోలో వచ్చిన డంకీ చిత్రంలో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

తెలుగు ఇండస్ట్రీలో నటనలో ఓనమాలు దిద్ది.. బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా చెలామణి అవుతోంది తాప్సీ పన్ను. ఇటీవల షారూక్, రాజ్ కుమార్ హీరానీ కాంబోలో వచ్చిన డంకీ చిత్రంలో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

  • Published Jan 19, 2024 | 12:45 PMUpdated Jan 19, 2024 | 12:45 PM
అతడితో 10 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నా..: తాప్సీ పన్ను

టాలీవుడ్‌లో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని.. బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడ పాగా వేస్తుంటారు చాలా మంది హీరోయిన్స్. అలాంటి వారిలో ఒకరు తాప్సీ పన్ను. తెలుగులో ఝమ్మంది నాదం అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సొట్ట బుగ్గల సుందరి.. అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ నటిగా ఎదిగింది. రవితేజ, ప్రభాస్, గోపిచంద్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది.అటు తమిళ్ మూవీస్‌లోనూ అదరగొట్టింది. బాలీవుడ్‌లో అప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నదాని ఫేట్ మార్చిన మూవీ పింక్. ఈ సినిమాతో ఆమెకు బీటౌన్‌లో వరుస అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంట్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ తాప్సీనే. అలా చేస్తూనే.. తెలుగులో వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది.

తాజాగా డంకీ మూవీతో పలకరించింది అమ్మడు. బాలీవుడ్ బాద్ షా డంకీ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితం ఎప్పుడు గోప్యంగా ఉంటుంది. అయితే ఆమె కొన్ని రోజుల నుండి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై పెదవి విప్పింది తాప్సీ. యాక్టర్ అయ్యాక డేట్ అనేది డిఫకల్టా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది తాప్సీ. ‘ నాకైతే తెలియదు కానీ..మాథిస్ బోతో గత పది సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నాను. నేను 13 సంవత్సరాల క్రితం యాక్టింగ్ స్టార్ చేశాను. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంవత్సరంలోపే అతడిని కలిశా. డేటింగ్ స్టార్ చేశా. అతనిని విడిచిపెట్టాలని కానీ మరోకరితో ఉండాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే మా బంధం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సమాధానమిచ్చింది తాప్సీ.

Dating him for 10 years

అతన్నే ఇష్టపడటానికి కారణం ఏంటంటే.. 100 జెన్యూన్ కావడం వల్లనే అని చెప్పుకొచ్చింది. కొన్ని నెలల క్రితం కూడా ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్‘ సెషన్ నిర్వహించింది తాప్సీ పన్ను. ఇందులో ఓ నెటిజన్ మీ పెళ్లి ప్రణాళికలు ఏంటీ అన్న ప్రశ్నకు చమత్కారంగా సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. ‘నేను ఇంకా గర్భవతిని కాదు కాబట్టి.. ఇప్పుడైతే కాదు. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను. నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను’ అని కూడా చెప్పింది. ఇప్పుడు తాప్సీ మూడు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. తాప్సీ సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio