iDreamPost
android-app
ios-app

Taapsi: కేవలం ఆమె వలనే నాకు ఈ సినిమా ఆఫర్లు వస్తున్నాయి.. : తాప్సి

  • Published Jun 19, 2024 | 11:00 AM Updated Updated Jun 19, 2024 | 11:00 AM

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు వెండి తెరపై పరిచయం అయింది తాప్సి.. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుసగా చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తాప్సి తన మూవీ ఆఫర్స్ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు వెండి తెరపై పరిచయం అయింది తాప్సి.. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుసగా చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తాప్సి తన మూవీ ఆఫర్స్ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Jun 19, 2024 | 11:00 AMUpdated Jun 19, 2024 | 11:00 AM
Taapsi: కేవలం ఆమె వలనే నాకు ఈ సినిమా ఆఫర్లు వస్తున్నాయి.. : తాప్సి

ఒకే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసే వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు తాప్సి . ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు వెండి తెరపై పరిచయం అయింది తాప్సి. ఈ సినిమాలో ఈ అమ్మడి అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేసింది రాధావేంద్ర రావు కాబట్టి.. తాప్సిని ఇంకాస్త అందంగా చూపించారు. ఈ సినిమా తర్వాత.. ఆమె తెలుగులో వరుసగా చాలానే ఆఫర్లు అందుకుంది. చాలా మంది యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి.. మంచి హిట్స్ నే ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత ఎందుకో సరైన ఆఫర్లు లేక.. బాలీవుడ్ కు వెళ్ళిపోయింది ఈ అమ్మడు. అయితే ఇప్పుడు తాప్సి తన మూవీ ఆఫర్స్ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు తాప్సి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తక్కువ సమయంలో తాప్సి బాగానే క్రేజ్ సంపాదించుకుంది. కేవలం బాలీవుడ్ లో సినిమాలలో నటించడమే కాకుండా.. కంగనా రనౌత్ లాంటి వాళ్ళతో మతాలకు సంబంధించిన వివాదాల్లోనూ ఆమె వార్తల్లో నిలిచింది. గతంలో కూడా తాప్సిపై అనేక రకాల వార్తలు వినిపించాయి. బాలీవుడ్ లో ఆఫర్లు ఎలా వస్తాయి అనే విషయంపై కూడా తాప్సి పలు మార్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు కూడా తాప్సి తనకు సినిమా అవకాశాలు రావడం పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Tapsee Pannu

తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ” నేను స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటాకు లేటెస్ట్ వర్షన్ అని అంతా అనుకుంటున్నారు. అందుకే నాకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి. ప్రీతీ జింటా గురించి అందరికి తెలుసు. ఆమె చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. నేను బాలీవుడ్ లో ఉండటానికి కారణమైన ప్రీతీ జింటా పేరు చెడగొట్టేలా ఏదీ చేయను. ఆమె లానే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తా.. ప్రీతీ జింటా నేను సినిమాల్లోనే చూశాను.” అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సరే.. ఏదైనా సినిమా ఆఫర్ రావాలంటే మాత్రం.. దాని వెనుక నటి నటుల కష్టం కూడా చాలానే ఉంటుందని చెప్పి తీరాల్సిందే. మరి తాప్సి షేర్ చేసుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş