iDreamPost
android-app
ios-app

Movie: త్వరలోనే రానున్న సూర్య కంగువ గ్లింప్స్

  • Published Feb 22, 2024 | 1:59 PM Updated Updated Feb 22, 2024 | 1:59 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న సినిమా కంగువ. అయితే తాజాగా కంగువ సినిమాకు దర్శకుడు శివ రూట్ మార్చి అందరిని ఆశ్చర్యపరిచారంటా. అదేలా అంటే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న సినిమా కంగువ. అయితే తాజాగా కంగువ సినిమాకు దర్శకుడు శివ రూట్ మార్చి అందరిని ఆశ్చర్యపరిచారంటా. అదేలా అంటే..

  • Published Feb 22, 2024 | 1:59 PMUpdated Feb 22, 2024 | 1:59 PM
Movie: త్వరలోనే రానున్న సూర్య కంగువ గ్లింప్స్

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న కోలీవుడ్ భారీ చిత్రం కంగువ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్ నటి దిషా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరైన దర్శకుడు శివ, కంగువతో రూట్ మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా ఒక్కో ప్రమోషనల్ మెటీరియల్ తో సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.

ఇటీవలే హీరో సూర్య ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారట. ఇక ఈ సినిమా కొత్త గ్లింప్స్ చూసిన పరిశ్రమలోని కొందరు వ్యక్తులు చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారని తెలుస్తోంది. గ్లింప్స్ చూసిన వారి ప్రకారం, కంగువ ఒక యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ గా ఉంటుందని, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు భారీ ట్రీట్ ఇస్తుందని తెలుస్తోంది. కాగా కంగువ టీమ్ కొత్త గ్లింప్స్ విడుదల తేదీని తొందరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. గతంలో సూర్య పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్/గ్లింప్స్ ని విడుదల చేయగా ఆ వీడియో మంచి స్పందన రాబట్టింది. ఇక సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ సరిగ్గా జరిగిన తరువాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని కంగువ నిర్మాతలు చెప్పారు.

ఈ సినిమాని 3Dతో పాటు IMAX ఫార్మాట్‌లలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇదివరకే తెలిపారు. బాహుబలి సీరీస్ ఎలాగైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిందో… కంగువ కోలీవుడ్ కు ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం తమిళ సినీ వర్గాలలో ఉంది. ఇక సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ కారణంగా ట్రేడ్ వర్గాల వారు కూడా కంగువ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు సాధించిన భారీ విజయాన్ని కంగువ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిపీట్ చేస్తుందని సూర్య అభిమానులతో పాటు తమిళ సినీ ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు నిజం అవ్వాలనే కోరుకుందాం.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet