iDreamPost
android-app
ios-app

పాస్ పోర్ట్ పోగొట్టుకున్న సురేఖావాణి కూతురు సుప్రిత! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 09:00 AM, Thu - 27 July 23
  • Author ajaykrishna Published - 09:00 AM, Thu - 27 July 23
పాస్ పోర్ట్ పోగొట్టుకున్న సురేఖావాణి కూతురు సుప్రిత! వీడియో వైరల్!

సినిమాల్లోకి రాకపోయినా కొంతమంది సెలబ్రిటీల వారసులు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా మెల్లగా వారు కూడా సెలబ్రిటీ హోదా తెచ్చుకొని ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా సెలబ్రిటీ కూతురుగా పరిచయమై.. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సురేఖా వాణి కూతురు సుప్రిత. ఈ భామ గురించి తెలుగు యూత్ కి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా పోస్టులతో తన ఫాలోయర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే.. నటిగా సురేఖవాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో ఏళ్లుగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు.

ఇక ఓవైపు నటిగా.. మరోవైపు మోడరన్ మదర్ గా సురేఖా తన కూతురుని పెంచింది. అలా తల్లితో పాటు పాపులర్ అయిన సుప్రిత.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించి కొత్త పోస్టులు పెడుతూనే ఉంటుంది. అయితే.. యూట్యూబ్ లో కూడా షార్ట్ వీడియోస్, వ్లాగ్స్ పోస్టు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన పాస్ పోర్ట్ పోయిందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది అమ్మడు. ప్రస్తుతం సుప్రిత ఫారెన్ టూర్ లో ఉంది. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ.. అక్కడి ప్రదేశాలన్నీ తిరుగుతూ ఫోటోలు, వీడియోలు పెడుతుంది. సుప్రిత ప్రెజెంట్ మియామిలో ఉందట.

ఈ విషయాన్నీ చెబుతా.. తాను మియామిలో ఉన్నానని.. తన పాస్ పోర్ట్ పోయిందని చెప్పింది. పాస్ పోర్ట్ పోవడంతో కొత్త వీడియోస్ ఏమి చేయలేదు. ఇక్కడే ఇరుక్కుపోతానని భయపడ్డాను. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి.. అందరికి కాల్ చేసి చెప్పేసరికి టైమ్ సరిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్, పోలీస్ రిపోర్ట్ పెట్టి ట్రావెల్ చేయొచ్చని తెలిసింది. కానీ.. ఎయిర్పోర్ట్ వాళ్లకు ఓకే నా కాదా అనేది తెలియదు. తాము ఇప్పుడు ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నాం అంటూ తన ఫ్రెండ్ ని కూడా వీడియోలో చూపించింది సుప్రిత. ప్రస్తుతం సుప్రిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరి సుప్రిత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet