iDreamPost
android-app
ios-app

Surekha Vani: డ్రగ్స్ కేసు వార్తలపై స్పందించిన నటి సురేఖా వాణి!

Surekha Vani: డ్రగ్స్ కేసు వార్తలపై స్పందించిన నటి సురేఖా వాణి!

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేపీ చౌదరి డ్రగ్స్ కేసు. అతనితో టాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు, నటులతో సంబంధం ఉంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియా మొత్తం కేపీ చౌదరితో సెలబ్రిటీలు దిగిన పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. కొందరైతే ఫొటోల్లో ఉన్న యాక్టర్స్ కి కూడా కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నాయా? డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాక్టర్స్ ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే బుల్లితెర నటి, జూనియర్ సమంత ఈ ఆరోపణలపై స్పందించిన విషయం తెలిసిందే. అనవసరపు విషయాల్లోకి తన పేరుని లాగొద్దంటూ కామెంట్ చేసింది. సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వారికి అసలు నిజాలు చెబుతానంటూ చెప్పుకొచ్చింది. అషూరెడ్డి తర్వాత సురేఖా వాణి ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కేపీ చౌదరితో సురేఖా వాణి, ఆమె కుమార్తె క్లోజ్ గా ఉన్న ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. సురేఖా వాణికి కేపీ చౌదరి ముద్దు పెట్టడం, కేపీ చౌదరికి సురేఖా వాణి ముద్దు పెడుతున్న ఫొటోలు కావడంతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఈ వార్తలపై సురేఖా వాణి స్వయంగా స్పందించారు. ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోలో “అందరికీ నమస్కారం. మా మధ్య కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఆరోపణల వల్ల మా కెరీర్, మా పిల్లల కెరీర్, మా కుటుంబం ఆరోగ్యం అన్నింటిపై ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్ దయచేసి ఆరోపణలు చేయడం ఆపండి” అంటూ సురేఖా వాణి చెప్పుకొచ్చింది. కేపీ చౌదరి కేసులో ఇంకా ఎంతమందిపై ఆరోపణలు వస్తాయి? అసలు ఎవరు దోషులుగా తేలతారు? కేపీ చౌదరి అసలు డ్రగ్స్ సరఫరా చేశాడా? అంటూ పలు ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş