iDreamPost
android-app
ios-app

లావణ్యకు అండగా కల్యాణ్ దిలీప్ సుంకర.. రాజ్ తరుణ్ కు సూటి ప్రశ్నలు!

  • Published Jul 11, 2024 | 11:22 AM Updated Updated Jul 11, 2024 | 11:22 AM

Kalyan Dileep Sunkara Questions To Raj Tarun: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రాపై లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు కూడా ఆమె పోలీసులకు సమర్పించింది. అలాగే ఇప్పుడు లావణ్య తరఫున సుప్రీంకోర్టు లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర సీన్ లోకి వచ్చారు. రాజ్ తరుణ్ కు సూటి ప్రశ్నలు వేశారు.

Kalyan Dileep Sunkara Questions To Raj Tarun: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రాపై లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు కూడా ఆమె పోలీసులకు సమర్పించింది. అలాగే ఇప్పుడు లావణ్య తరఫున సుప్రీంకోర్టు లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర సీన్ లోకి వచ్చారు. రాజ్ తరుణ్ కు సూటి ప్రశ్నలు వేశారు.

  • Published Jul 11, 2024 | 11:22 AMUpdated Jul 11, 2024 | 11:22 AM
లావణ్యకు అండగా కల్యాణ్ దిలీప్ సుంకర.. రాజ్ తరుణ్ కు సూటి ప్రశ్నలు!

రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. అలాగే రాజ్ తరుణ్ కు హీరోయిన్ మాల్వి మల్హోత్రకు సంబంధం ఉందని.. మాల్వి మల్హోత్రా కోసమే తనను దూరం పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు అబార్షన్ చేయించాడు అంటూ మరో ఫిర్యాదు కూడా చేసింది. ఇప్పుడు లావణ్యకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అండగా నిలిచాడు. లావణ్య తరఫున కల్యాణ్ దిలీప్ సుంకర కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. మస్తాన్ సాయి అనే పాత్రను తెరమీదకు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఆధారం ఉన్నా కూడా నిరూపించాలని సవాలు చేశారు.

రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేశాడు అంటూ మొదటి నుంచి లావణ్య ఆరోపిస్తోంది. లావణ్య చేసిన ఫిర్యాదుకు ఆధారాలు సమర్పించాలి అని పోలీసులు లావణ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా 170కి పైగా ఫొటోలు మెడికల్ రిపోర్టులు కూడా పోలీసులకు సమర్పించినట్లు లావణ్య చెప్పుకొచ్చాంది. తన పేరిట తిరుగుతున్న ఆడియోలు నిజం కాదని చెప్పుకొచ్చింది. 2023 సెప్టెంబర్ లో తనను రెచ్చగొట్టి కావాలనే అలా మాట్లాడేలా చేశాడని చెప్పింది. తాను మాత్రమే తిట్టిన మాటలను ఎడిట్ చేసినట్లు తెలిపింది. తాను కేవలం కోపం, బాధలో మాత్రమే అలా మాట్లాడినట్లు చెప్పింది.

Lavanya rajtharun

తనకు డ్రగ్స్ కేసుకు సంబంధం లేకపోయినా కూడా కావాలనే ఇరికించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా బంధానికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించినట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర రాజ్ తరుణ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. “మస్తాన్ సాయి- లావణ్య డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తావా? నీకు తెలిసిన ఆస్పత్రిలో బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేయించి డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపించగలవా? యూట్యూబ్ ఛానల్ కి లీగల్ నోటీసులు ఇస్తే.. అతనే తమ పీఆర్వోకి డబ్బులిచ్చి క్లిప్స్ ప్లే చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. ఆ రికార్డింగులు కూడా పోలీసులకు వినిపించాం.

ఎన్నో రిలేషన్స్ ఫెయిల్ అవుతాయి. కానీ, ఇది లవ్వో.. లివిన్నో కాదు. నువ్వు పెళ్లిచేసుకున్నావ్. ఆమెని విడాకులు ఇవ్వమని నీ మొబైల్ నంబర్ నుంచి నువ్వు ఒత్తిడి చేసిన ఆధారాలు పోలీసులకు ఇచ్చాం. అందుకే పోలీసులు ఐపీసీ సెక్షన్స్ 420, 493, 506 ఐపీసీ కింద నీ మీద, మాల్వీ మల్హోత్రా, మాల్వీ మల్హోత్రా తమ్ముడిపై కేసు నమోదు అయ్యింది. ఇంక ఆరోపణలు ఏమీ వద్దు. అక్రమ సంబంధం ఉంటే నిరూపించు, డ్రగ్స్ తీసుకుంటే నిరూపించు, డ్రగ్ పెడ్లర్ అంటే నిరూపించు” అంటూ కల్యాణ్ దిలీప్ సుంకర సవాలు చేశారు.

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet