iDreamPost
android-app
ios-app

సన్నీ లియోన్ జీవితంలో ఇంత బాధ ఉందా? ప్రేమించిన వాడే పెళ్లి పేరుతో..

Sunny Leone On Her Past: సన్నీ లియోన్ కెరీర్, పెళ్లి గురించి అందరికీ తెలుసు. కానీ, తన లైఫ్ లో కూడా ఎంతో బాధ ఉందని ఎవరికీ తెలియదు. స్వయంగా సన్నీనే తన లైఫ్ తనకు జరిగిన దారుణమైన మోసం గురించి వెల్లడించింది.

Sunny Leone On Her Past: సన్నీ లియోన్ కెరీర్, పెళ్లి గురించి అందరికీ తెలుసు. కానీ, తన లైఫ్ లో కూడా ఎంతో బాధ ఉందని ఎవరికీ తెలియదు. స్వయంగా సన్నీనే తన లైఫ్ తనకు జరిగిన దారుణమైన మోసం గురించి వెల్లడించింది.

సన్నీ లియోన్ జీవితంలో ఇంత బాధ ఉందా? ప్రేమించిన వాడే పెళ్లి పేరుతో..

అందాల తార సన్నీ లియోన్ కు ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హిందీ ఒక్కటే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఇండస్ట్రీల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు కేవలం స్పెషల్ సాంగ్స్ కి మాత్రమే పరిమితమైన ఈ అమ్మడు.. ఇప్పుడు చేయబోయే 7 సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఒక మూవీలో స్పెషల్ సాంగ్ తో అలరిచనుంది. సన్నీ అలాగే స్పిట్జ్ విల్లా సీజన్ 5కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పిట్జ్ విల్లా కార్యక్రమంలో తన లైఫ్ లో తనకి జరిగిన అత్యంత భారీ మోసాన్ని, తన హృదయం ఎలా ముక్కలైందో చెప్పుకొచ్చింది.

సన్నీ లియోన్ కి 2011లో వెబర్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది. ఎక్కడా కూడా తనకు కష్టం, బాధ అంటే ఏంటో తెలియకుండా వెబర్ సన్నీ లియోన్ ని చూసుకుంటున్నాడు. అయితే వెబర్ కంటే ముందు సన్నీకి మరొకరితో ఎంగేజ్మెంట్ జరిగిందంట. తన హదయం ముక్కలైన క్షణాలను సన్నీ లియోన్ అభిమానులతో పంచుకుంది. ప్రేమించిన వాడు, ఎంతో నమ్మిన వ్యక్తి  తనకి చేసిన మోసం గురించి అందరికీ వివరించింది. అలాగే తన భర్త డేనియల్ వెబర్ గొప్పతనం గురించి కూడా సన్నీ లియోన్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.

Sunneyleone

“ఇదంతా నా పెళ్లికి ముందు జరిగిన ఘటన. నేను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అతనితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మా పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాం. అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. పెళ్లి కోసం హవాయి దీవుల్లో గుర్తుండిపోయేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను. అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత పెళ్లికి రెండు నెలలు ఉందనగా నా మనసు ఎందుకో అతని విషయంలో కీడు శంకించింది. అతని ప్రవర్తన నాకు అనుమానాలు రేకెత్తేలా చేసింది. నేరుగా అతడినే అడిగాను. నా మీద నీకు ప్రేమ ఉందా అని. అందుకు అతను నీ మీద ప్రేమ ఎప్పుడో పోయింది అంటూ సమాధానం చెప్పాడు. ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు. నా ప్రాణం పోయినంత పనైంది. నా హృదయం ముక్కలైంది.

ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానో కూడా నాకు తెలీదు. ఆ తర్వాత నా లైఫ్ లోకి వెబర్ వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ ఎంతో అందంగా మారిపోయింది. నాకు ప్రతి క్షణం తోడుగా ఉన్నాడు. నా తల్లిదండ్రుల మరణించిన సమయంలో కూడా నాకు అండగా ఉన్నాడు. ఎప్పటికీ నా భర్త చేయి నేను వదలను” అంటూ సన్నీ లియోన్ తన బ్రేకప్ స్టోరీ, తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. డేనియల్ వెబర్- సన్నీ లియోన్ 2011లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు 2017లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి పద్ధతిలో నోవా, ఆషర్ అనే మగ పిల్లలకు జన్మనిచ్చారు. వెబర్ ని వివాహం చేసుకున్న తర్వాత కెరీర్ పరంగా కూడా సన్నీ లియోన్ పరుగులు పెట్టింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతోంది. మరి.. సన్నీ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి