iDreamPost
android-app
ios-app

తెలుగు రియాలిటీ షోలో సన్నీ లియోన్‌.. తెలుగుదనం ఉట్టి పడేలా..

  • Published Oct 03, 2023 | 6:40 PM Updated Updated Oct 03, 2023 | 6:40 PM
  • Published Oct 03, 2023 | 6:40 PMUpdated Oct 03, 2023 | 6:40 PM
తెలుగు రియాలిటీ షోలో సన్నీ లియోన్‌.. తెలుగుదనం ఉట్టి పడేలా..

తెలుగు ప్రేక్షకులకు సన్నీ లియోన్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నీలి చిత్రాల నటనలోంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత.. సినిమాల్లో బిజీ అయిపోయారామె. హిందీతో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె.. దాదాపు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేశారు. 2014లో వచ్చిన కరెంట్‌ తీగ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చేసింది చిన్న పాత్రే అయినా.. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2017లో వచ్చిన ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ చేశారు.

2022లో వచ్చిన జిన్నా సినిమాలో ఫుల్‌ లెన్త్‌ క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా.. సన్ని లియోన్‌ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉన్న సన్నీ.. సరికొత్తగా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యారు. తెలుగులో ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఓ ప్రముఖ ఛానల్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న ‘తెలుగు మీడియం హైస్కూల్‌’ షోకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.

ఈ షోకు సంబంధించిన ప్రోమో కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆ షోలో సన్నీ తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో అదరగొట్టారు. అంతేకాదు! వచ్చీ రాని తెలుగు మాట్లాడుతూ.. తెలుగుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, సన్నీ లియోన్‌ విదేశీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ఐదుకు పైగా ఇంగ్లీష్‌ సినిమాల్లో నటించారు. అంతేకాదు! ఓ నేపాలీ సినిమా.. ఓ బంగ్లాదేశీ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరి, సన్నీ లియోన్‌ తెలుగు రియాలిటీ షోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet