iDreamPost
android-app
ios-app

ఆ వీడియోస్ వల్లే నా తల్లి బానిసలా మారింది.. సన్నీ లియోన్ ఎమోషనల్!

  • Author ajaykrishna Published - 09:30 AM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 09:30 AM, Mon - 24 July 23
ఆ వీడియోస్ వల్లే నా తల్లి బానిసలా మారింది.. సన్నీ లియోన్ ఎమోషనల్!

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి తెలుగుతో పాటు ఇండియా అంతటా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితమే సన్నీ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు సన్నీ పో*ర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేసి.. ఆ వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆ వృత్తికి స్వస్తి చెప్పి.. బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. ప్రెజెంట్ చేతినిండా సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తో బిజీ అయిపోయిన సన్నీ.. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి తలచుకొని ఎమోషనల్ అవుతుంటుంది. గతంలో పో*ర్న్ స్టార్ అయిన సన్నీ.. బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత జిస్మ్ 2 మూవీతో నటిగా మారింది.

ఇక సన్నీ సినిమాల్లోకి వచ్చాక.. తనకు కెరీర్ లో సపోర్ట్ గా నిలిచిన పార్టనర్ డేనియల్ వెబర్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు.. ఓ కూతురు. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండియాలోనే సెటిల్ అయ్యింది సన్నీ. ఓవైపు కెరీర్ ని, మరోవైపు తన ఫ్యామిలీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే సన్నీ లైఫ్ గురించి.. ఆమె లైఫ్ స్టోరీపై తీసిన ‘కరణ్ జీత్ కౌర్’ అనే వెబ్ సిరీస్ లో చూపించిన విషయం విదితమే. అయితే.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్న సన్నీ.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తన వల్లే తన తల్లి మద్యానికి బానిస అయ్యిందని చెబుతా వాపోయింది.

సన్నీ మాట్లాడుతూ.. “అమ్మకి ముందునుండి మద్యం అలవాటు ఉండేది. కానీ.. నేను పో*ర్న్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక పూర్తిగా మద్యానికి బానిస అయిపోయింది. నేను ఆ వీడియోలు చేయడం తనకు ఇష్టం లేదని భావించేదాన్ని. ఎప్పుడూ ఇంట్లో గొడవలు. కొన్నాళ్ళు పోయాక అమ్మకి మద్యమే ఎక్కువ అనుకున్నా. కానీ.. ఆ తర్వాత ఆమె అలా అవ్వడానికి కారణం నేను, మా ఫ్యామిలీ కాదని అర్థమైంది. పరిస్థితుల వలన ఆమె అలా అయిపోయింది. తాను మానసికంగా డిస్టర్బ్ అయ్యిందని తెలిసింది. అయితే.. నా ఫ్యామిలీని కాపాడుకోవడానికే నేను ఆ వృత్తిలోకి వెళ్లాల్సి వచ్చింది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సన్నీ చివరిగా తెలుగులో జిన్నా మూవీలో మెరిసింది. మరి సన్నీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet