iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి అదిరిపోయే ప్లాన్.. స్పిరిట్ కు యానిమల్ తో లింక్..!

  • Published Nov 05, 2024 | 4:51 PM Updated Updated Nov 05, 2024 | 4:51 PM

ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే అందరికి చెమట్లు పట్టేస్తున్నాయి . ఇప్పుడు చేస్తున్న సినిమాలా తర్వాత డార్లింగ్ సందీప్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే అందరికి చెమట్లు పట్టేస్తున్నాయి . ఇప్పుడు చేస్తున్న సినిమాలా తర్వాత డార్లింగ్ సందీప్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Nov 05, 2024 | 4:51 PMUpdated Nov 05, 2024 | 4:51 PM
సందీప్ రెడ్డి అదిరిపోయే ప్లాన్.. స్పిరిట్ కు యానిమల్ తో లింక్..!

డార్లింగ్ ప్రభాస్ లైన్ అప్స్ చూస్తే ఒక్కొక్కరికి మతి పోతుంది. కాస్త లేట్ అయినా కూడా దర్శకులంతా ప్రభాస్ తోనే సినిమా తీయాలని వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు. ఇక సౌత్ సినిమాల వలన బాలీవుడ్ కు కంటి మీద కునుకు ఉండడం లేదు. ఎప్పుడు ఏ సినిమా ఎలాంటి విధ్వసం సృష్టిస్తుందా అని వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలంటే అక్కడ నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క రికార్డ్ ను తొక్కుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్. దీనితో తర్వాత ప్రభాస్ ఎలాంటి అరాచకాన్ని సృష్టిస్తాడా అని.. సౌత్ కంటే కూడా నార్త్ ఏ ఎక్కువ ఎదురుచూస్తుంది. ఏకంగా 5 భారీ ప్రాజెక్ట్స్ ను చేతిలో పట్టుకుని యుద్దానికి సిద్ధం అయ్యాడు. ఏ వైపు నుంచి విరుచుకుపడతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. రాజాసాబ్, ఫౌజీ 2025 లో వచ్చేస్తాయి. 2026 లో కల్కి వస్తుంది.. సలార్ 2 ప్రశాంత్ ఫ్రీ అయిన తర్వాత కూల్ గా స్టార్ట్ చేస్తాడు. స్పిరిట్ మూవీ కూడా 2026 లో వచ్చేస్తుంది. ఈ క్రమంలో స్పిరిట్ నుంచి ఒక్కొక్కటిగా వినిపిస్తున్న వార్త.. సినిమాపై స్పైస్ పెంచుతుంది.

అసలు సందీప్ తో సినిమా అంటేనే సగం హైప్ వచ్చేసింది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అని.. పోలీస్ ఆఫీసర్ అని.. గ్యాంగ్ స్టర్ అని.. ఇలా రకరకాలా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజషన్ ఇది.. సినిమా జోనర్ ఇది అని అసలు ముందే గెస్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డిసైన్ చేసే పాత్రలన్నీ కూడా చాలా లోతుగా ఉంటాయి. ఒక కుర్రాడికి అగ్రేషన్ వస్తే ఎలా ఉంటుందో చూపించాడు.. ఒక కొడుకుకి అగ్రేషన్ వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ఇప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ , ఓ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటున్నాయి. అయితే ఈ సినిమాను యానిమల్ తో లింక్ చేసే ప్లాన్ లో ఉన్నాడట సందీప్. యానిమల్ సినిమా బాలీవుడ్ లో ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సినిమాను స్పిరిట్ ను లింక్ చేయడం వెనుక ప్లాన్ ఏంటి అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

యానిమల్ ను స్పిరిట్ తో లింక్ చేసి.. ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తాడో అర్ధం కావడం లేదు. ఆల్రెడీ యానిమల్ సినిమాకు సిక్వెల్ ను అనౌన్స్ చేశారు. మరి యానిమల్ కంటిన్యుషన్ స్పిరిట్ మూవీ ఉంటుందా.. లేదా విక్రమ్ సినిమా రేంజ్ లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి సృష్టించినట్లే. దీనితో ఇప్పుడు ప్రేక్షకులలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. అసలు సినిమా నుంచి వినిపిస్తున్న అప్డేట్స్ ఏ ఈ రేంజ్ లో మోత మోగిపోతున్నాయి. ఇక సినిమా నుంచి టీజర్ , ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తే… హైప్ మాములుగా ఉండదు. ఒక్కసారి రాజాసాబ్ ,ఫౌజీ సినిమాలు కంప్లీట్ అయ్యాయంటే.. స్పిరిట్ మొదలైపోతుంది. అప్పుడు కానీ అసలు అప్డేట్స్ బయటకు రావు. ఇక రానున్న రోజుల్లో స్పిరిట్ అప్డేట్స్ ఎలాంటి హీట్ పుట్టిస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis