iDreamPost
android-app
ios-app

OTTలోకి ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Mar 04, 2024 | 8:46 AM Updated Updated Mar 14, 2024 | 4:55 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన ఫ్యాంటసీ హారర్ మూవీ ఊరు పేరు భైరవకోన. అయితే ఈ మూవీ తాజాగా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎప్పుడంటే..

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన ఫ్యాంటసీ హారర్ మూవీ ఊరు పేరు భైరవకోన. అయితే ఈ మూవీ తాజాగా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Mar 04, 2024 | 8:46 AMUpdated Mar 14, 2024 | 4:55 PM
OTTలోకి ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాను డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిచగా.. ఇందులో హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించారు. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఇక, ఈ చిత్రం విడుదలైన ఆరభంలో మంచి వసూళ్లు రాబెట్టిన.. ఆ తర్వాత మాత్రం అనుకున్న స్టాయిలో జోరును అందుకోలేకపోయింది. దీంతో గతకొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడలేని మూవీ ప్రియులు కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందనని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఇంతకి ఎప్పుడంటే..

ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన సినిమా గతనెల ఫిబ్రవరి 16వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజయింది. అలా రిలీజ్ అయిన సినిమా మంచి పాజిటివ్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.కాగా, రిలీజ్ అయిన 10 రోజుల్లోనే ఈ సినిమా రూ.25.11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఈ మూవీ జోరును అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని గతకొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ప్లాట్ ఫామ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఈ మూవీని ఓటీటీలో చూద్దమా అని ఎదురుచూసే మూవీ ప్రియులకు ఓ మంచి శుభవార్త అందింది. ఈ సినిమా మార్చి 15వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందింది. కానీ ఈ విషయం పై ఇంక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే మరోవైపు ఆహాలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.కాగా, త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ రానుంది.

ఇక ఊరు పేరు భైరవకోన సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలి వారం నుంచి ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా.. ఆ సమయంలో వేరే చిత్రాలు థియేటర్లలో లేకపోవడం కూడా ఈ మూవీకి కలిసి వచ్చింది. అయితే ఆ తర్వాత స్థాయిలో సినిమా వసూళ్ల జోరు తగ్గడంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాగా, ఇందులో వెన్నెల కిశోర్ , వైవా హార్ష, రవిశంకర్ లు కీలకపాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతకంపై రాజేశ్ దండా నిర్మించగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పించారు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర ఆద్భుతమైన సంగీతాన్ని అందించారు. మరి, త్వరలో ఓటీటీలోకి ఊరు పేరు భైరవకోన సినిమా వస్తుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş